కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించారు. విషయంలోకి వెళితే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన కోడలు జ్యోతి రామ్ గోపాల్ వర్మ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. విషయంలోకి వెళితే ఇటీవల డైరెక్టర్ ఆర్జీవి 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' అనే సినిమా తెరకెక్కించడం జరిగింది. ముందుగా ఈ సినిమాకి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ పెట్టడంతో ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన చాలా మంది ప్రముఖులు రాజకీయ నాయకులు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై తీవ్రస్థాయిలో విమర్శలు వర్షం కురిపించడం జరిగింది.

 

దీంతో రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్ ని 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' అనే టైటిల్ గా మార్చడం జరిగింది. అయితే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ లను పోలిన పాత్రలతో అవహేళన చేశారంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేఏ పాల్ పై స్పెషల్ గా ఓ పాటను కూడా చిత్రీకరించారు. దీంతో కేఏ పాల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించిన తీరు పై సినిమాపై హైకోర్టు న్యాయ స్థానాన్ని ఆశ్రయించటం మనకందరికీ తెలిసినదే. సెన్సార్ బోర్డ్ కి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో సినిమా రిలీజ్ అవ్వకుండా కొన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత సెన్సార్ బోర్డ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 12వ తారీకున రాంగోపాల్ వర్మ  'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' సినిమా రిలీజ్ చేయడం జరిగింది.

 

ఈ సందర్భంలో రాంగోపాల్ వర్మ ట్విట్టర్ సాక్షిగా కె ఏ పాల్ తనకి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో తాజాగా ఆ విషయానికి సంబంధించి కె ఏ పాల్ కోడలు వర్మ తీరుపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇదే తరుణంలో గతం లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫోటోను కూడా వర్మ మార్ఫింగ్ చేశారని వీటి పై చర్యలు తీసుకోవాలని వాటికి సంబంధించిన ఫోటోలతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదులో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేరు కూడా ప్రస్తావనకు రావడంతో కేసు సీరియస్ అయ్యే అవకాశం ఉందని… ఈ విషయంలో ఆర్జీవి ఏ మాత్రం కొంచెం అలసత్వం ప్రదర్శిస్తే జైలుకెళ్లడం ఖాయం అన్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: