టాలీవుడ్ సినిమా పరిశ్రమలో గడిచిన ఈ పదేళ్లలో అనేక సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. సినీ ఇండస్ట్రీ టెక్నీకల్ గా ఎంతో అభివృద్ధి చెందింది. సరికొత్త తరహా సినిమాలు ఎన్నో వస్తున్నాయి. గడిచిన 10 సంవత్సరాల సమయంలో కొన్ని వేల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. అయితే కొందరు కొత్త దర్శకులు అయినప్పటికీ మంచి మంచి సినిమాలు తీశారు. 

 

వారి సినిమాలు చూస్తే వావ్.. వీళ్ళు బాగా అనుభవం ఉన్న డైరెక్టర్లు అని అనిపిస్తుంది. కానీ వారికీ ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ ఎంతో అద్భుతమైన సినిమాలు తీసి ప్రేక్షకుల మనసు దోచేసుకున్నారు. ఒక సినిమా హిట్ తో వీరి సినిమాలు ఇంకా ఎప్పుడు వస్తాయి.. ఈసారి ఎంత అద్భుతంగా ఉంటుందో అన్న రీతిలో వారి సినిమాలు ఉన్నాయి. ఎంతో అనుభవం దర్శకులతో ఈ పదేళ్లలో పోటీపడిన సినిమా దర్శకులు వీరే.. 

 

యువ దర్శకుడు మారుతీ.. ఈరోజుల్లో సినిమా అంటూ 2011లో వచ్చి బలే బలే మొగాడివోయి, ప్రేమ కథ చిత్రం వంటి చిత్రాలు తీసి ప్రస్తుతం ఫార్మ్ లో ఉన్న దర్శకుడు మారుతీ. ఆ తర్వాత హను రాఘవపూడి.. రొమాంటిక్ లవ్ స్టోరీస్ తీస్తూ ప్రేక్షకులను అలరించే దర్శకుడు. ఇతని దర్శకత్వంలో అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, ఈ మధ్యే పది పది లేచే మనసు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తీశాడు.  

 

ఇంకా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2015లో పటాస్ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 వంటివి మంచి చిత్రాలు తీసి చిత్రసీమలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుధీర్ వర్మ.. 2013లో స్వామి రా రా సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ వర్మ దోచెయ్ వంటి సినిమాలు తీసి అభిమానులను సొంతం చేసుకున్నాడు. రచ్చ, బెంగాల్ టైగర్ వంటి చిత్రాలు తీసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు సంపత్ నంది. 

 

కొరటాల శివ దర్శకత్వం వహించిన నాలుగు సినిమాలు ప్రపంచంలోనే ఎంతో ఆదరణ పొందాయి. అవి మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు, భరత్ అనే నేను అయితే మరో సినిమా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి. మరో అద్భుతమైన సినిమా ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ సినిమా. ఇంకా కొత్త దర్శకుడు క్రిష్ ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశాడు. అందులో గమ్యం ఒకటి, వేదం, కంచె.. ఈ మధ్యే కొన్ని సినిమాలు తీశాడు కానీ అవి ప్రేక్షకులకు నచ్చక రెండో రోజే రావడం మానేశారు. ఇంకా అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ వంగ.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తీసింది ఒక్క సినిమా అయినా టాలీవుడ్ ని ఓ ఊపు ఊపిన దర్శకుడు సందీప్ వంగ. చూసారుగా మన 10 సంవత్సరాలలో కొత్త దర్శకులు వీరే. 

మరింత సమాచారం తెలుసుకోండి: