రియల్‌ లైఫ్‌ మామ- మేనల్లుడు అయిన హీరోలు వెంకటేశ్‌- నాగచైతన్య రీల్‌ లైఫ్‌లోనూ అదే పాత్రలు పోషించిన చిత్రం ‘వెంకీమామ’. . సినిమాకి డివైడ్ టాక్ వినిపించినా.. ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరధం పడుతున్నారు. దీంతో కలెక్షన్లలో 'వెంకీమామ' దూసుకుపోతున్నాడు. విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందిన 'వెంకీమమ' సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ప్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు బాబీ డైరెక్ట‌ర్‌. ఇక వచ్చే శుక్రవారం వరకూ థియేటర్స్‌లో పెద్ద సినిమాలు లేకపోవడంతో.. వెంకీ మామ హౌస్ ఫుల్ కలెక్షన్లతో వీరకుమ్మడు కుమ్మేస్తున్నాడు.

 

బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెంకీమామ లో వెంకీకి జోడిగా పాయల్ రాజ్‌పుత్‌ నటించగా, నాగచైతన్య సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. సురేష్‌ బాబు, టీవీ విశ్వప్రసాద్‌లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. దగ్గుబాటి, అక్కినేని అభిమానులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. వెంకీ మరియు చైతు ఇద్దరికీ ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. మేనల్లుడి కోసం జీవితాన్ని త్యాగం చేసే మామగా వెంకటేశ్‌, మావయ్య కోసం అన్నింటినీ వదులుకున్న అల్లుడిగా నాగచైతన్య వారి వారి పాత్రల్లో జీవించారు. 

 

ఇక క‌లెక్ష‌న్స్ ప‌రంగా మూడో రోజు కూడా అదే జోరు చూపిస్తోంది. కేవలం మూడురోజుల్లోనే 45 కోట్ల రూపాయలు వసూలు చేసి బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటింది. ఈ క్రేజీ మల్లీస్టారర్‌ పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతూ దగ్గుబాటి, అక్కినేని అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇక మూడు రోజుల్లో రూ. 17.50 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది వెంకీ మామ. కాగా, సురేష్‌ బాబు, టీవీ విశ్వప్రసాద్‌లు సంయుక్తంగా సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 

 

`వెంకీ మామ‌` ఫ‌స్ట్ వీకెండ్ ఏపీ+ తెలంగాణ‌ క‌లెక్ష‌న్స్‌(రూ. కోట్ల‌లో):

 

నైజాం - 6.82 కోట్లు

 

సీడెడ్‌- 3.28 కోట్లు

 

గుంటూరు- 1.54 కోట్లు

 

ఉత్త‌రాంధ్ర‌- 2.33 కోట్లు

 

తూర్పు గోదావ‌రి- 1.08 కోట్లు

 

ప‌శ్చిమ గోదావ‌రి- 0.92 కోట్లు

 

కృష్ణా- 1.13 కోట్లు

 

నెల్లూరు- 0.66 కోట్లు
------------------------------------------------------
ఫ‌స్ట్ వీకెండ్ మొత్తం షేర్‌- 17.76 కోట్లు
------------------------------------------------------

 

మరింత సమాచారం తెలుసుకోండి: