టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగా, అక్కినేని, ఘట్టమనేని, మంచు కుటుంబాలు ప్రముఖ కుటుంబాలుగా చలామణి అవుతాయి. ఈ కుటుంబాలకు సంబంధించిన హీరోల సినిమాలు ఏవైనా విడుదలైన ఇండస్ట్రీ అంతా ఆ హీరో కి సంబంధించి విడుదలైన సినిమా గురించి వార్తలు కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే ముందుగా మెగా కుటుంబం గురించి మాట్లాడాల్సి వస్తే చిరంజీవి ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం జరిగిందో అప్పటినుండి మెగా కుటుంబానికి దెబ్బ మీద దెబ్బ గట్టిగానే తగిలాయి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సినీ ఫీల్డ్ లో ఉన్నాగాని ‘గబ్బర్ సింగ్’  ముందు వరకు ఏమీ పెద్దగా రాణించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది.

 

ఇదే తరుణంలో ఘట్టమనేని మహేష్ బాబు 2006వ సంవత్సరం లోనే పోకిరి సినిమాతో ప్రభంజనం మొదలుపెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ దగ్గర భూకంపాన్ని సృష్టించి ఆ టైం లోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఉండగానే మంచి క్రేజ్ ఫార్మ్ సంపాదించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరో అన్నట్టుగా అప్పట్లోనే చలామణి అయిపోయాడు. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇండస్ట్రీలో మహేష్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య పోటాపోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగింది.

 

అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 2014 సమయంలో రాజకీయాల్లోకి వెళ్లి పోవడం జరిగింది. ఇక అక్కినేని హీరోల విషయానికి వస్తే...కింగ్ నాగార్జున సోగ్గాడు తో అదరగొట్టిన ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా అభిమానులను అలరించ లేకపోయాయి. ఇక అక్కినేని అఖిల్ విషయానికి వస్తే సినిమా ఎంట్రీ ఇచ్చిన ఇప్పటివరకు అక్కినేని కుటుంబానికి తగ్గ హిట్ తన ఖాతాలో వేసుకుని లేకపోయాడు. నాగచైతన్య మాత్రం చాలా సక్సెస్ ఫుల్ హీరోగా తన జర్నీ యావరేజ్ గా లాగిస్తున్నాడు. ఇక మంచు కుటుంబ విషయానికి వస్తే మంచు మనోజ్ మరియు మంచు విష్ణు అడపాదడపా సినిమాలు చేస్తూ కొంతకాలం కెరీర్ని సాగించారు.

 

ఆ తర్వాత ఇద్దరూ చేస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిన తరుణంలో ప్రస్తుతం వీరు స్పీడ్ తగ్గించాడు. మొత్తంమీద చూసుకుంటే 2010 నుంచి 2020 సంవత్సరం మొదలు వరకు మెగా - ఘట్టమనేని కుటుంబాలు ఆధిపత్యం కనబరుస్తున్నాయి .. అయితే ఈ ఏడాది మాత్రం మెగా ఫామిలీ కి సరైన హిట్ లేదు .. మహేశ్ మాత్రం దూసుకుపోతున్నాడు. భరత్ అనే నేను, మహర్షి వంటి రెండు సూపర్ బ్లాక్ బస్టర్ హిట్లతో ఈ మూడు కుటుంబాల లో విజేతగా నిలిచాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా తో వచ్చే ఏడాది సంక్రాంతికి హ్యాట్రిక్ కొట్టడానికి మహేష్ రెడీ అవుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: