టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ మూవీస్ అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది.  ఇటీవల ఎన్నికల ముందు క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.   ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు.. కానీ ఈ రెండు మూవీస్ అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ని ఆకర్షించలేకపోయాయి.  ఇంతలో ఏపిలో ఎన్నికలు రావడం..బాలయ్య హిందూపూరం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.  ప్రస్తుతం కేయస్‌ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ `రూలర్‌` మూవీలో నటిస్తున్నారు.  ఈ మద్య వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా భారీగా జరిగింది.  ఇప్పటికే ట్రైలర్ కి మంచి టాక్ వచ్చింది.  

 

సినిమా డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.  తాజాగా బాలయ్యకు వరుసగా సింహా, లేజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన బోయపాటి శ్రీనివాస్ తో మరో సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ.  ఇక బోయపాటి-బాలకృష్ణ మూవీస్ అంటే భారీ అంచనాలు పెరిగిపోతాయి.. ఈ నేపథ్యంలో అప్పుడే ఈ మూవీ గురించి రక రకాల చర్చలు కొనసాగుతున్నాయి. బాలయ్య 105వ మూవీ వస్తోన్న ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా బాలీవుడ్‌ నటి సోనాక్షిసిన్హాను పెట్టాలని బోయపాటి భావిస్తున్నాడట. ఈ మేరకు బోయపాటి ఇప్పటికే సోనాక్షిసిన్హాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిలింనగర్‌లో వార్త చక్కర్లు కొడుతోంది.  

 

అంతే కాదు విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. . సోనాక్షిసిన్హా లింగా సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సోనాక్షిసిన్హా నటించిన దబాంగ్ 3 సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. తాజాగా ఈ విషయంపై సోనాక్షీ క్లారిటీ ఇచ్చింది. బాలకృష్ణ సినిమాలో నటిస్తున్నాననే వార్తలు నిజం కాదు. నేను చేయబోయే కొత్త సినిమా విషయాలను త్వరలో వెల్లడిస్తానని సోనాక్షి స్పష్టం చేసింది. బాలకృష్ణ, బోయపాటి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు వచ్చిన వార్తలను సోనాక్షి సిన్హా కొట్టిపారేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: