ఒకప్పుడు సినిమాలకు ఇప్పుడు సినిమాలకు చాలా మార్పులు చేర్పులు ఉన్నాయి. ఒకప్పుడు సినిమాల్లో అయితే ఫుల్ సెంటిమెంట్ గా ఉండేది... కానీ ఇప్పటి సినిమాల్లో మాత్రం కామెడీ ఉంటుంది. గత పది సంవత్సరాల నుంచి సినిమా పిక్చరైజేషన్  అంతా పూర్తిగా మారిపోయింది. అంతకుముందు సినిమాలైతే థియేటర్కు వెళ్లినమంటే  ఆ సినిమాలో చూపించిన సెంటిమెంట్కు సినిమా ప్రేక్షకులందరికీ కళ్ళలోంచి నీళ్ళు తిరిగేవి. అబ్బో ఆ సెంటిమెంట్ గురించి మాటల్లో చెప్పలేం.. కానీ గత పది సంవత్సరాల నుంచి సినిమాలో కామెడీకి ఎక్కువగా దట్టిస్తున్నారు దర్శకులు. అటు  ప్రేక్షకులు కూడా ఏడుపుగొట్టు సినిమాలను రాం రాం అంటూ  కామెడీ సినిమాలకు స్వాగతం పలుకుతున్నారు. 

 

 

 

 సినిమా చూడాటానికి  థియేటర్ కి వెళ్లి కాసేపు నవ్వుకోవడానికి కాని.. ఏడుపు గొట్టు సినిమాలతో  థియేటర్ కి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుని రావటం ఏంటి  సుమీ . అందుకే ఇప్పుడొస్తున్న సినిమాలు అన్ని ఎంటర్టెన్మెంట్ గ్యారంటీ అన్నట్లుగా ఉంది... కొన్ని కొన్ని సినిమాల్లో అయితే అవసరం లేకుండా కామెడీ దట్టించేస్తున్నారు దర్శకులు. ఇక ఇప్పుడు కమెడియన్స్ కోసం ఏ దర్శకులు చూడడం లేదు... ఏకంగా హీరోతోనే కామెడీ పంచేస్తున్నారు దర్శకులు. ఇక హీరోలు కూడా కమీడియాన్స్  కంటే ఎక్కువ కామెడీ చేస్తూ ఉండడంతో ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలను బాగా స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలు చూసుకుంటే ఎక్కువగా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఉంటున్నాయి . 

 

 

 

 2010లో అదుర్స్, డార్లింగ్, కాలేజా,  మర్యాద రామన్న లాంటి కొన్ని సినిమాలు కామెడీ తో అదరగొట్టాయి. ఇక  2011 సంవత్సరంలో.. అలా మొదలైంది,  100% లవ్, దూకుడు,  పిల్ల జమిందార్, లాంటి సినిమాల్లో ఓవైపు హీరోయిజం ఎలివేట్ చేస్తూనే మరోవైపు ఫుల్ కామెడీ ని పంచాయి . 2012 సంవత్సరంలో ఇష్క్ వంటి  సినిమాలు  కామెడీతో అదరగొట్టాయి. 2013 సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు,  రేసుగుర్రం,  వెంకటాద్రి ఎక్స్ప్రెస్,  లాంటి సినిమాలు కూడా ప్రేక్షకులను కామెడీ తో బాగా అలరించాయి. ఇలా ప్రతి ఏడు ఎన్నో కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఇక 2019 సంవత్సరంలో ఇయర్ ప్రారంభంలోనే  ఎఫ్ 2 సినిమా  ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది... ఇక తాజాగా వెంకీ మూవీ సినిమాతో మరోసారి ఇయర్ ఎండింగ్ లో కూడా ప్రేక్షకులను బాగా అలరించారు. ఏదేమైనా ఇప్పుడు కామెడీ సినిమాలకి బాగా క్రేజ్ ఉందబ్బా.

మరింత సమాచారం తెలుసుకోండి: