వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మినీ యుద్ధమే జరగనుంది.  ఎందుకంటే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న ఇద్దరు టాలీవుడ్ లో హీరోలు  ఒక్క రోజు తేడాతో  తమ సినిమాలతో  ప్రేక్షకులముందుకు రానున్నారు.  అందులో భాగంగా  సరిలేరు నీకెవ్వరు తో  జనవరి 11 న  సూపర్ స్టార్  మహేష్ బాబు  ప్రేక్షకులను పలకరించనుండగా  అల.... వైకుంఠపురములో  అనే సినిమా తో  జనవరి 12న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  థియేటర్లలోకి రానున్నాడు. ఈరెండు సినిమాలకు ఇప్పటికే  కావాల్సినంత హైప్ వచ్చింది.  దాంతో ఫ్యాన్స్ ఎప్పుడెపుడూ తమ అభిమాన హీరోల సినిమాలు చూద్దామనే  అతృతతో ఎదురుచూస్తున్నారు. 
 
అయితే ఈ రెండు సినిమాలకు  సెకండ్ హాఫ్ గండం తప్పేలా లేదనే  గుసగుసలు వినిపిస్తున్నాయి.  సినిమా విజయం సాధించాలంటే సెకండ్ హాఫ్ చాలా కీలకం.  ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్ టైన్ చేసిన సెకండ్ హాఫ్  లో విషయం లేకపోతే  సినిమా ఫలితం ఎలా ఉంటుందో  ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అదే ఫస్ట్  హాఫ్ ను యావరేజ్  గా  చూపెట్టినా సెకండ్ హాఫ్ లో  విషయం ఉంటే  ఆ సినిమా  గట్టెక్కినట్లే.  అయితే  ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు , అల.. వైకుంఠపురములో  సినిమాల సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం  టెంక్షన్ పడుతున్నారట  మేకర్స్. 
 
సరిలేరు నీకెవ్వరు, ఫస్ట్ హాఫ్ అంతా  ఆర్మీ ఎపిసోడ్ , ట్రైన్ ఎపిసోడ్  తో  బాగానే ఎంటర్ టైన్ చేస్తుందట అయితే సెకండ్ హాఫ్ కు వచ్చే సరికి  కథ అంత రాయలసీమ కు షిఫ్ట్ అవుతుందట.  ఇక అక్కడి నుండి  సినిమా అంతా ఎమోషనల్ గా సాగిపోతుందట. ఈ ఎమోషన్ కు  గనుక  ప్రేక్షకుడు  కనెక్ట్ అవుతే సినిమాకు తిరుగుండదు లేకపోతే మాత్రం  అంతే సంగతులు. 
 
ఇక అల వైకుంఠపురములో సెకండ్ హాఫ్ మొత్తం  కామెడీ  తోనే సాగిపోతుందట. త్రివిక్రమ్ మార్క్  కామెడీ కి తోడు  మధ్య మధ్య లో అల్లు అర్జున్ చేసే స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ తో  సినిమా  సరదాగా సాగిపోతుందట. అయితే  ఎంత కామెడీ , యాక్షన్ వున్నా అవ్వని  కథలో  భాగంగానే   వస్తే  ఓకే కానీ  ఏదో  అతింకించాలని చూస్తే మరో అజ్ఞాతవాసి గాక తప్పదు.  మరి ఈ రెండు సినిమాలు సెకండ్ హాఫ్ గండాన్ని దాటి  బ్లాక్ బాస్టర్ హిట్లు అనిపించుకుంటాయో లేవో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: