టాలీవుడ్ ద్వారా త‌మ టేలెంట్‌ను నిరూపించుకున్న‌వారు ఎంద‌రో. ప్రేక్ష‌కుల్లో త‌మ‌ కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని ఈ రేంజ్‌కు ఎద‌గిన వారూ ఉన్నారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ ఎంద‌రో సినీ ప్ర‌ముకుల‌ను కోల్పోయింది. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందా. ఒకప్పుడు తెలుగుతో పాటు పలు సౌతిండియన్ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఆర్తి అగర్వాల్ మరణించిన సంగతి తెలిసిందే. 2001లో నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆర్తీ అగర్వాల్ తక్కువ కాలంలోనే అగ్రహీరోయిన్‌ల జాబితాలో చేరారు. అయితే పలు చిన్న చిత్రాల్లో నటిస్తున్న ఆర్తి.. ఆ సినిమాలు మధ్యలో ఉండగానే ఆకస్మికంగా మృతి చెందారు. 

 

అలాగే ఉద‌య్ కిర‌ణ్‌.. ఎవ్వరి అండదండలు లేకుండా నటించిన తొలి మూడు సినిమాలతో సిల్వర్ జూబ్లీ అందుకున్న ఏకైక తెలుగు హీరో ఉదయ్ కిరణ్, చిత్రం సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన ఉద‌య్ కిర‌ణ్ ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ అందుకున్నాడు. 37 ఏళ్ల వయసులోనే ఉదయ్ కిరణ్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. అయితే ఆక‌స్మాతుగా సూసైడ్ చేసుకోవ‌డం అప్పుడు క‌ల‌క‌లం రేగింది. మ‌రియు రియ‌ల్ స్టార్ శ్రీ‌హ‌రి..విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఇలా అన్ని రకాల పాత్రలు చేసిన నటుడు శ్రీహరి. మంచి పాత్రలు చేస్తూ ఓ వెలుగు వెలుగుతోన్న దశలో దురదృష్టవశాత్తు ఆయన మన్నుంచి దూరంగా, తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు.

 

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నవ్వుల దర్శకుడిగా పేరుగాంచిన ఈవీవీ.సత్యనారాయణ కూడా టాలీవుడ్‌కు దూర‌మ‌య్యారు.  కేన్సర్ కార‌ణంగా వైద్యం తీసుకుంటున్న స‌మ‌యంలో గుండెపోటు రావ‌డంతో ఆయ‌న మ‌ర‌ణించారు. అలాగే హాస్యనటుల్లో ఓ వెలుగు వెలిగిన ఎంస్‌.నారాయ‌ణ‌, సుత్తివేలు, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యంను కూడా టాలీవుడ్‌కు కోల్పోయింది. తెలుగు తెర‌పై త‌మ‌దైన  హాస్యాన్ని పండించిన ఈ ముగ్గురూ స్వ‌ర్గ‌స్తుల‌య్యారు. మ‌రియు టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌నం సినిమా టైమ్‌లో టాలీవుడ్‌కు దూర‌మ‌య్యారు.

 

అలాగే అభినవ సీతమ్మగా ప్రసిద్ది చెందిన అలనాటి సినీ నటి, నిర్మాత అంజలీదేవి 2014లో క‌న్నుమూశారు.  నటనా జీవితాన్ని 8 సంవత్సరాల వయసులోనే రంగస్థలంపై ప్రారంభించిన అంజలి 1947లో గొల్లభామ సినిమాతో చిత్రపరిశ్రలో అడుగుపెట్టి ఎన్నో విజ‌యాల‌ను అందుకున్నారు. మ‌రియు టాలీవుడ్‌లో ఓ మెరుపు మెరిసిన కృష్ణ‌కుమారి, మంజుల‌, సుజాత ల‌ను కూడా టాలీవుడ్ కోల్పోయింది. ప్రముఖ సినీ నటుడు రామిరెడ్డి అంకుశం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి విలన్ గా ప్రవేశించింది.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, ఈయ‌న అనారోగ్య స‌మ‌స్య 2011లో స్వ‌ర్గ‌స్తుల‌య్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: