ముఖానికి రంగేసుకునే వాళ్లు రాజకీయాలకు పనికిరారు అంటే ఎన్.టి.ఆర్ ఆ కసితో పాలిటిక్స్ లో వచ్చి సంచలనం సృష్టించారు. ఆయన తర్వాత అలాంటి అటెంప్ట్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. తన సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చే వాళ్లంతా తన అభిమానులే అన్నట్టుగా ఫీల్ అయ్యి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల్లో నిలబడ్డారు. అయితే అది త్వరగానే మూతపడ్డ విషయం తెలిసిందే. 

 

సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవికి పెద్ద షాకే ఇచ్చారు మెగా అభిమానులు. అందుకే చిన్నగా మళ్లీ సినిమాల బాట పట్టాడు. 2005 లో శంకర్ దాదా జిందాబాద్ సినిమాతో కెరియర్ ఆపేసి దాదాపు రిటైర్మెంట్ ప్రకటించిన చిరంజీవి మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఖైది నంబర్ 150తో హీరోగా చేశాడు. అంతకుముందే రాం చరణ్ బ్రూస్ లీలో అలా కనిపించి మురిపించాడు చిరంజీవి.

 

కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ కత్తికి రీమేక్ గా వచ్చిన ఖైది నంబర్ 150తో సూపర్ హిట్ అందుకున్నాడు చిరంజీవి. పదేళ్లకు పైగా గ్యాప్ వచ్చినా తనకు ఆడియెన్స్ లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని గుర్తించారు చిరు. అందుకే తన 151వ సినిమానే చిరకాల కోరికగా ఉన్న సైరా నరసిం హా రెడ్డి సినిమా చేశారు. కొన్నాళ్లుగా ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి కథను చేయాలనే ఆలోచనలో ఉన్న చిరంజీవి ఇది కరెక్ట్ టైం అని సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఆ సినిమా చేశాడు. రిటైర్మెంట్ చేసి దాదాపు కెరియర్ ముగిసింది అనుకునే టైంలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేస్తున్నాడు చిరు. ఎంతైనా ఇప్పటికి తాను బాక్సాఫీస్ మొనగాడు అనిపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. 

 

ఇదే ఉత్సాహంతో ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు మెగాస్టార్. రీ ఎంట్రీ తర్వాత చిరు సినిమాలను తనయుడు రాం చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: