రేడియో జాకీ గా తన జీవితాన్ని మొదలు పెట్టిన నాని, మంచి వ్యక్త్యగా పేరుతెచ్చుకున్నాడు. తర్వాత  అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ గా నటించిన నాని, అష్ట చమ్మ సినిమా తో హీరో గా తెలుగు తెరకు పరిచమయ్యాడు. స్వయం కృషి తో పైకొచ్చిన అతి కొద్దీ వాళ్ళల్లో నాని కూడా కూడా ఒకరు. అలా ఎన్ని కష్టాలను దిగమింగుకుంటూ వచ్చిన నాని ఇప్పుడు స్టార్ గా ఎదిగాడు. 

 

అష్టా చమ్మా చిత్రం మంచి విజయం అందుకోవడం తో  హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ సినిమా తర్వాత ఈగ, ఏటో వెళ్ళిపోయింది మనసు,  రైడ్, భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది ఇలా ఎన్నో చిత్రాల్లోలో నాని నటించారు. ఆ సినిమాలన్నీ కూడా మంచి హిట్ తో ద్దోసుకు పోయిన చిత్రాలే కావడం గమనార్హం . నా జీవితంలో ఇప్పటికి 26 చిత్రాలలో నటించారు. 

 

మరో విశేషమేంటంటే.. నాని డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలను తెరక్కేకించారు. అ ! చిత్రానికి నాని నిర్మాత బాధ్యతలు చేపట్టారు. ఆ సినిమా కోసం నాని ఎంత కష్టపడినా కూడా కథ ఆకట్టుకోలేక పోవడంతో సినిమా విజయాన్ని అందుకోలేక పోయింది. ఇకమీద సినిమాలను నిర్మించకూడదని అనుకున్న నాని మళ్ళీ సినిమాల లో నటిస్తూ వస్తున్నారు. 

 

ఇటీవల విడుదలయిన జెర్సి, గ్యాంగ్ లీడర్ చిత్రాలు వరుస విజయాలను అందుకున్నాయి. దీంతో నాని ఇప్పుడు రెండు సినిమాల లో నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న 'వి ' అనే చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాని విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో పూర్తయ్యాక శివ నిర్వాణ  దర్శకత్వం లో మరో సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: