మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి.  ఎందుకంటే మహేష్ బాబు బాల నటుడిగా తెరంగ్రేటం చేసి అనేక సినిమాలు చేశారు.  పదోతరగతి వరకు మహేష్ బాబు అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించి మెప్పించిన మహేష్, ఆ తరువాత సినిమాలు పక్కన పెట్టి పూర్తిగా చదువుపై దృష్టి పెట్టారు.  అలా చదువుపై దృష్టి పెట్టిన మహేష్ ఆ తరువాత 1999లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో  అయ్యాడు.  

 

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.  ఇందులో మహేష్ బాబు నటన అమోఘం అని చెప్పాలి.  అప్పటికే అనేక సినిమాల్లో బాలనటుడిగా కనిపించారు.  1983 నుంచి 1990 వరకు మహేష్ బాల నటుడిగా అనేక సినిమాలు చేశారు.  ఆ తరువాత మహేష్ తొమ్మిదేళ్లు గ్యాప్ తీసుకొని రాజకుమారుడిగా ఎంట్రీ ఇచ్చాడు.  మురారి వంటి క్లాస్ సినిమా చేసిన మహేష్ బాబు మాస్ సినిమాలు చేయడానికి ఎక్కువగా అలవాటు పడ్డాడు.  1999 నుంచి 2010 వరకు అయన సినిమాల్లో చాలా వరకు మాస్ సినిమాలే ఉన్నాయి.  


అయితే, 2010 నుంచి తన పంథాను మార్చారు.  2010లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఖలేజా సినిమా రిలీజ్ అయ్యింది.  ఖలేజా సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది.  అయితే, అనుకున్నంతగా సినిమా హిట్ కాలేదు.  కారణం ఎక్కువగా క్లాసికల్ గా ఉండటమే.  సినిమా విదేశాలలో బాగా ఆడింది.  అటు బుల్లితెరపై ఇప్పటికి సినిమాకు మంచి రేటింగ్ ఉంటుంది.  


దీని తరువాత దూకుడు, బిజినెస్ మెన్ సినిమాలు మాస్ ఇమేజ్ ను తీసుకొచ్చాయి. అయితే, ఆ తరువాత మహేష్ తన పంథాను మార్చాడు.  సోషల్ మెసేజ్ ఉండే సినిమాలు చేయాలని అనుకున్నారు.  అందుకు తగ్గట్టుగా కథలు దొరికితే వాటిని చేయడానికి ఇష్టపడ్డారు.  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి.  ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా సామాజిక అంశాన్ని స్పృశిస్తూ తీసిన సినిమానే.  వచ్చే ఏడాది జనవరి 11 న రిలీజ్ కాబోతున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: