అందం అభినయం ఆమె సొంతం... హీరోయిన్ లు అందరికీ ఈమె ఒక ఇన్స్పిరేషన్... విభిన్నమైన పాత్రలు అన్నింటికీ ఈమె కేరాఫ్ అడ్రస్.. ఇక నటన విషయంలో ఆమెకు ఆమే సాటి... ఆమె ఎవరో కాదు అక్కినేని వారి కోడలు నాగచైతన్య భార్య సమంత. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఈ అమ్మడు. అంతేకాకుండా విభిన్నమైన కథనాలను ఎంచుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. గత దశాబ్ద కాలం నుండి ఈ అమ్మడికి లక్కు  బాగా కలిసొస్తుంది. ఈ అమ్మడు చేసిన సినిమాల్లో ఎక్కువగా మంచి విజయాలు సాధించిన సినిమాలు ఉంటడం  గమనార్హం. అక్కినేని వారి కోడలు అయిన తర్వాత  ఈ అమ్మడి క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ఇంకో విషయం ఏమిటంటే 2010 సంవత్సరం లోనే సమంత టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2010 సంవత్సరంలో నాగచైతన్య కు జోడిగా ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అందరిని మాయ  చేసింది సమంత. 

 

 

 

 ఇక ఆ తర్వాత బృందావనం సినిమా తో మంచి విజయాన్ని అందుకుంది సమంత. ఇక 2011లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సమంత  నటించిన దూకుడు సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ఇక 2012 సంవత్సరంలో... దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో హీరో నాని తో జోడీ ఈగ సినిమాతో సెన్సేషన్ హిట్ అందుకుంది సమంత. ఆ తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు ఈ సినిమాతో ఆకట్టుకున్న సమంత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో .. తన చిలిపి తనం తో ప్రేక్షకులని అందరి మతి పోగొట్టింది  సమంత. 2013 సంవత్సరంలో అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించిన మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది సమంత. 

 

 

 

 ఇక 2014 సంవత్సరంలో కూడా తన జోరు పెంచి ఏకంగా ఐదు సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. తన ఫ్యామిలీ సినిమా అయినా మనం సినిమాల్లో కూడా నటించి అదరగొట్టింది . 2015 సంవత్సరంలో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో  స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన నటించి.. మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. 2016 సంవత్సరం జనతా గ్యారేజ్, 24,  బ్రహ్మోత్సవం, అ ఆ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. 2017 సంవత్సరంలో రాజుగారిగది2 సినిమాలో నటించింది. 2018 సంవత్సరంలో ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోయింది ఏకంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా చేసింది. సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా రంగస్థలం. సినిమాలో సమంత నటిగా  ఎన్నో మెట్లు ఎదిగిపోయింది. ఇక ఈ సంవత్సరం మజిలీ,  బేబీ లాంటి మంచి విజయాలను సొంతం చేసుకుంది సమంత... ఇక ఇప్పుడు తమిళ హిట్ మూవీ 96 రీమేక్లో నటిస్తోంది. కాగా  గత దశాబ్దకాలంగా ఎక్కువ విజయాలను సొంతం చేసుకుని లక్కీ హీరోయిన్ గా నిలిచింది అక్కినేని సమంతానే.

మరింత సమాచారం తెలుసుకోండి: