టాలీవుడ్ సినిమా పరిశ్రమ పరిస్థితి ఒకప్పటితో పోలిస్తే నేటి కాలంలో ఎంతో మారింది అనే చెప్పాలి. ఇక ఒక్కరొక్కరుగా వస్తున్న యువ హీరోల్లో కొంతమంది తమ ఆకట్టుకునే యాక్టింగ్ టాలెంట్ తోపాటు తమ తెలివితేటలతో మంచి వెరైటీ సినిమాలు ఎంచుకుంటూ ప్రేక్షకుల మదిని దోచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఆ విధంగా గడిచిన ఈ దశాబ్ద కాలంలో ముందుగా చిన్న చిన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, ప్రస్తుతం మంచి సినిమాలతో దూసుకుపోతున్న యువ హీరో శర్వానంద్. మొదట్లో వీధి, అమ్మ చెప్పింది వంటి డిఫరెంట్ సినిమాల్లో నటించిన శర్వా, ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గమ్యం సినిమాతో మంచి హీరోగా పేరు దక్కించుకున్నారు. 

 

ఆ తరువాత నుండి పలు సక్సెస్ఫుల్ చిత్రాలతో శర్వా ముందుకు సాగుతున్నాడు. మరొక హీరో సందీప్ కిషన్ కూడా 2010లో వచ్చిన ప్రస్థానం సినిమాతో నటుడిగా అడుగుపెట్టి అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకోవాతో పాటు ఇటీవల విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక వీరితో పాటు స్రవంతి రవికిశోర్ గారి తమ్ముడి కుమారుడైన హీరో రామ్, దేవదాసు సినిమాతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అడుగుపెట్టి తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఆ తరువాత నుండి తన టాలెంట్ తో ఛాన్స్ ల తో ముందుకు సాగుతున్న రామ్, ప్రస్తుతం టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక వీరందరితో పాటు ముఖ్యంగా చెప్పుకోవలసింది రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి. తొలుత అక్కడక్కడ కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన విజయ్

 

ఆ తరువాత పెళ్లి చూపులు సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారడంతో పాటు ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ హిట్ అందుకున్నాడు. అనంతరం అర్జున్ రెడ్డి, గీత గోవిందంల విజయాలతో యువ హృదయాల్లో మంచి పేరు సంపాదించాడు. అలానే వీరితో పాటు నాచురల్ స్టార్ నాని కూడా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అష్టా చమ్మ సినిమాతో అరంగేట్రం చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఆపై వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్న నాని, ప్రస్తుతం నాచురల్ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ మంచి పేరు సంపాదించారు. మరొక నటుడు శ్రీవిష్ణు కూడా మొదట్లో కొన్ని సినిమాల్లో చిన్న క్యారెక్టర్ లో నటించిన విష్ణు, ఆ తరువాత డిఫరెంట్ గా సినిమాలు ఎంచుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పేరుతో దూసుకెళ్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్ కి ఏకై వచ్చి మేకై కూర్చున్న కథానాయకులు వీరే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: