మన తెలుగు సినిమా పరిశ్రమలో తమ ఫ్యామిలీ కి మంచి పేరు ప్రఖ్యాతలు మరియు డబ్బు ఉన్నప్పటికీ కూడా కెరీర్ పరంగా సరైన సక్సెస్ఫుల్ సినిమాలు లేక సతమతం అవుతున్న హీరోలు కొందరు ఉన్నారు. వారిలో ముందుగా మెగా ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ కూడా ఒకరు. 2013లో గౌరవం సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన శిరీష్, ఇప్పటివరకు ఐదు సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ కూడా ఆయనకు సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. ఇక కాళిదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని సుశాంత్

 

ఆ తరువాత నుండి మొత్తం ఆరు సినిమాల్లో నటించినప్పటికీ కూడా ఇప్పటివరకు కెరీర్ పరంగా ఆయనకు సరైన సక్సెస్ లభించలేదు అనే చెప్పాలి. వీరితో పాటు మరొక అక్కినేని వారసుడు అఖిల్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలానే ఉంది. తన అన్నయ్య నాగచైతన్య మంచి హిట్స్ తో దూసుకుపోతున్నప్పటికీ, ఇప్పటివరకు కెరీర్ పరంగా నటించిన మూడు సినిమాలతో ఒక్క సక్సెస్ ని కూడా అందుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అఖిల్. కాగా ప్రస్తుతం అతడి నాలుగవ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మరొక నటుడు నవీన్ విజయ్ కృష్ణ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ తనయుడైన నవీన్, 

 

కెరీర్ పరంగా ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించాడు. ఫస్ట్ సినిమా నందిని నర్సింగ్ హోమ్ నుండి మొన్నటి ఊరంతా అనుకుంటున్నారు వరకు నవీన్ నటించిన సినిమాలేవీ కూడా టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాలేదు. అలానే సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ సంస్థ అధినేత ఎమ్ ఎస్ రాజు గారి తనయుడు సుమంత్ అశ్విన్ మొదటి సినిమా తూనీగ తూనీగ నుండి కెరీర్ పరంగా ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ, ఇప్పటివరకు ఆయనకు మాత్రం సరైన సక్సెస్ దక్కలేదు. గడచిన దశాబ్ద కాలంగా ఈ హీరోలు సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతున్నప్పటికీ కూడా వారితో అది దోబూచులాడుతూనే ఉంది. మరి రాబోయే కాలంలో ఇకపైనైనా వీరు సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: