ఈ మధ్య కాలంలో కొందరు రాజకీయనాయకులు కులం, మతం గురించి చర్చిస్తూ రాజకీయాలను చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలను , మతాలను ప్రస్తావిస్తూ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో కొందరు వ్యక్తిగత విషయాలతో పాటు భాషలను, కులాలను, మతాలను ప్రస్తావిస్తూ నీచరాజకీయాలకు తెరలేపుతున్నారు. వైసీపీ నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య కులాలకు, మతాలకు, భాషలకు సంబంధించిన మాటల తూటాలు పేలుతున్నాయి. 

పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ను ఉద్దేశించి ఏవైనా వ్యాఖ్యలు చేస్తే వైసీపీ నేతల నుండి అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి. ప్రముఖ పార్టీల నేతలే కుల, మతాలను ప్రస్తావిస్తూ రాజకీయాలను చేస్తూ ఉండటంపై ప్రజల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ మనుగడ కోసం కుల, మతాలను రాజకీయ నాయకులు ప్రస్తావిస్తూ ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో నాగబాబు "కేవలం హిందువులు ఇతర మతస్థుల నమ్మకాలను గౌరవించడం , ఆచారాలను గౌరవించడం మాత్రమే పరమత సహనం అనిపించుకోదని ఇతర మతస్థులు కూడా హిందూ మతస్థుల నమ్మకాల్ని, ఆచారాల్ని గౌరవించినప్పుడే నిజమైన పరమత సహనం అనిపించుకుంటుందని పోస్ట్ చేశారు. 
 
మరో పోస్టులో " తాను నాస్తికుడినని హిందూ మతాన్ని విపరీతంగా గౌరవిస్తానని అందుకే చార్వాకం, నిరీశ్వరవాదం ప్రసిద్ధి చెందాయని అన్నారు. వేరే మతాలలో ఎథిక్స్ ఫాలో అయ్యే వారికి చావే తలరాత అయ్యుండేది" అని ఘాటుగా స్పందించారు. సినీ విమర్శకుడు, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేశ్ నాగబాబుకు పిచ్చి ముదిరిందని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. "పిచ్చి ముదిరింది... వీడి తలకు రోకలి చుట్టండి" అంటూ కత్తి మహేశ్ నాగబాబు గురించి ఘాటుగా స్పందించారు. ఒక నెటిజన్ హిందూ కార్డ్ వాడుతున్నారంటే బీజేపీ చేరబోతున్నారేమో అని కామెంట్ చేయగా సందేహం అవసరం లేదని వీళ్లవి అన్నీ అబద్ధాలు మోసాలే అని కత్తి మహేశ్ సమాధానం ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: