చిత్ర పరిశ్రమలో రాణించాలంటే చాలా మంది తిండి తిప్పలు మానేసి మరి అవకాశాలకోసం పాట్లు పడుతుంటారు. స్టూడియోల వెంట కాళ్లరిగేలా తిరిగి అవకాశాలను అందిపుచ్చుకుంటారు . ఆ తర్వాత సినిమా ఛాన్స్ దొరికాగా మొదటి సినిమా హిట్ అయితే మాత్రం ఇంక వారిని ఆపడం ఎవరి తరం కాదనే చెప్పాలి. రోజు ఇంకా ఆన్ ఆఫ్ ల మధ్య, టెక్ యాక్షన్ ల మధ్య జీవితం సాగుతుంది. 

అయితే చాలా మంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొంతమందికి సినిమాలు లైఫ్ ను ఇస్తే కొంతమందికి మాత్రం ఈ సినిమాలు సరైన జీవితాన్ని ఇవ్వక మధ్యలోనే సినిమాలకు గుడ్ బై చెప్పారు. అలా అవకాశాలు లేని చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు కనిపించడం లేదు. మరి ఎవరు సినిమాలల్లో చాలా కాలం నుండి సినిమాల్లో కనిపించని హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.. 


అంజలి జవేరి : 

అంజలి జవేరి ఈమె  తెలుగులో అడపాదడపా సినిమాల్లో నటించి ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి కానీ, ఈ అమ్మడు తెలుగులో ఎక్కువకాలం రాణించలేక పోయింది. మొన్న ఆమధ్య వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో తళుక్కు మంది . మల్లి ఏ సినిమాలో కనిపించలేదు. 


లైలా : 


సొట్టబుగ్గల సుందరి లైలా కూడా అంటే అందం ఉన్న కూడా ఎక్కువ సినిమాలలో రాణించలేక పోయింది. శ్రీకాంత్, వెంకటేష్, జేడీ చక్రవర్తి లతో సినిమాలు చేసింది. పెళ్ళైక సినిమాలకు దూరంగా ఉంది. మొన్న ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ లో జడ్జీగా కనిపించింది. తర్వాత సినిమాలల్లో కనిపించలేదు . 


లయ :

తెలుగమ్మాయి అనే పదానికి సరైన అర్థం లయ.. చాలా సినిమాలలో నటించింది. టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలతో నటించిన లయ పెళ్లయ్యాక సినిమా వైపు తొంగి చూడటం మాట అటుంచి పూర్తిగా మీడియాకే గుడ్ బై చెప్పేసింది. 

రంభ : 

అందానికి అందమైన నిర్వచనం రంభ.. చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రంభ ఇప్పుడు సినిమాలల్లో ఎక్కడ కనిపించలేదని చెప్పాలి. పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంది కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తుంది. 


ఇలా చూసుకుంటే చాలా మంది తెలుగు హీరోయిన్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. కొందరు మాత్రం సినిమాలో ఇదొక పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు .. 

మరింత సమాచారం తెలుసుకోండి: