సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ జర్నీ తో దూసుకుపోతున్నాడు. భరత్ అనే నేను మరియు మహర్షి లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమా విజయాలతో ఎవరికీ అందనంత ఎత్తులో కెరియర్ ని చాలా జాగ్రత్తగా సక్సెస్ ట్రాక్ లో నడిపిస్తున్నాడు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో “సరిలేరు నీకెవ్వరు” అనే సినిమా చేయడం జరిగింది. కామెడీ తరహాలో మంచి కమర్షియల్ గా తెరకెక్కిన ఈ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 11వ తారీఖు న విడుదలవుతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు బీభత్సంగా పెట్టుకున్నారు మహేష్ బాబు అభిమానులు. ఈ నేపథ్యంలో త్వరలో సినిమా విడుదల అవుతున్న క్రమంలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా తెలివిగా మహేష్ చేస్తున్నాడు.

 

నిర్మాణ భాగస్వామ్యంలో కూడా మహేష్ ఉండటంతో మహేష్ బాబు సినిమాకి సంబంధించి ప్రమోషన్ సినిమా రిలీజ్ అవ్వక ముందు ఒక నెల ముందే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఒక మాస్ సాంగ్ మరియు రెండోది క్లాస్ సాంగ్ అభిమానులను అలరించిన క్రమంలో తాజాగా ఇవాళ విడుదలైన మూడో సాంగ్ ‘హీ ఈస్ సో క్యూట్’ అదరగొట్టే రీతిలో ఆడియన్స్ ని అలరించే విధంగా ఇంటర్నెట్ ప్రపంచంలో దూసుకుపోతోంది.

 

విషయంలోకి వెళితే ‘హీ ఈస్ సో క్యూట్’ సాంగ్ విడుదలైన అరగంటలోనే యూట్యూబ్ ఛానల్ లో ట్రెండ్ అవుతోంది నెంబర్ వన్ లో. ఈ సినిమాలో విడుదలైన రెండు పాటల కంటే ఈ పాటికి ఎక్కువ లైకులు వచ్చాయి అంతేకాకుండా ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ లేడీస్ టిక్ టాక్ లో ఇదే సాంగ్ చేస్తున్నారు. ఈ సాంగ్ విని ప్రస్తుతం మహేష్ అభిమానులు సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తు కన్ఫామ్ సంక్రాంతికి మహేష్ హ్యాట్రిక్ అని కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: