ఇటీవల చాలామంది  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ తీయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఫలితంగా మూడు సినిమాలు  ఆమె బయోపిక్‌పై రానున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ ‘తలైవి’, నిత్యామీనన్‌ ‘ద ఐరన్‌ లేడీ’ సినిమాలతో పాటు డిజిటల్‌ మాధ్యమంలో ‘క్వీన్‌’ వెబ్‌ సిరీస్  రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కింది. ఈ చిత్రానికి దర్శకత్వం గౌతమ్‌ మీనన్‌, మురుగేశన్‌ సంయుక్తంగా  వహించారు. చిత్రబృందం అటు న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తకుండా  జయలలిత పాత్రకు శక్తి శేషాద్రి అని నామకరణం చేసింది. ప్రస్తుతం అందరి నుంచీ ఈ చిత్రం ప్రశంసలు అందుకుంటోంది.

 

శక్తి... అనగా ఏమీ తెలియని బాల్యం నుంచి అందర్నీ శాసించే రాజకీయ నాయకురాలిగా ఎదిగిన తీరు, ఆమె సంఘర్షణ, పోరాటతత్వం అన్నీ కళ్లకు కట్టినట్టు ఈ చిత్రంలో కనిపిస్తాయి. అనిక   చిన్నప్పటి శక్తి పాత్రను పోషించగా, అంజనా జయప్రకాశ్‌ యవ్వనంలో  తెరమీద ప్రత్యక్షమవుతుంది. టాలీవుడ్‌ నటి రమ్యకష్ణ శక్తి రాజకీయ ప్రస్థానాన్ని మరింత రక్తి కట్టించదనడంలో సందేహం లేదు. బాల్యం నుంచే ఎన్నో ఆటంకాలను శక్తి  ఎదుర్కొంటూ ముళ్లదారిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ చివరాఖరకు విజయాన్ని ముద్దాడింది. ఒక్కసారి నటిగా గుర్తింపు వచ్చిన తర్వాత బాల్యంలో దక్కని ప్రేమ, అభిమానాలను ఆమెను చుట్టుముట్టడం విశేషం. 

 

 సమాజంలోని అసమానతలను, పితృస్వామ్య ధోరణిలను నిర్భయంగా, నిస్సందేహంగా శక్తి నిలదీస్తుంది. నాయకత్వ లక్షణాలను అక్కడే ఆమెలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తనకు ఎదురయ్యే ప్రతీ సమస్యను ఎదుర్కొంటూ మరింత రాటు దేలుతూ వచ్చిందే తప్ప కుంగిపోయి ఆమె ప్రయాణాన్ని ఏమాత్రం  ఆపలేదు.  గొప్ప స్త్రీగా ఆమెను అదే  నిలబెట్టింది. నటిగా, నాయకురాలిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఆమె జీవితం ఇక రాజకీయ ఎంట్రీతో  అనూహ్య మలుపు తిరుగుతుంది.

 

ఎమ్‌జీఆర్‌ పాత్రలో శక్తి జయలలిత ఎంతగానో గౌరవించే  నటుడు ఇంద్రజిత్‌ సుకుమార్‌ దర్శనమిస్తాడు. వీరి కలయికలో వచ్చే సీన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే శక్తి జీవితంలో ఎత్తుపల్లాలను స్పృశిస్తూనే, ఓ గొప్ప నాయకురాలిగా అందరి మనసులో ఎలా స్థానం సంపాదించిందన్నదే ఈ చిత్రం . ఈ సినిమా సామాజిక వ్యత్యాసాలు, పురుషాధిక్యం వంటి సమస్యలను కూడా టచ్‌ చేస్తుందీ . రాజకీయ నాయకురాలిగా రమ్యకృష్ణ ఠీవి, అధికారం, ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. మొత్తానికి తమిళ వెబ్‌సిరీస్‌లో క్వీన్‌ ప్రత్యేక స్థానం దక్కించుకోవడంతోపాటు అమ్మ(జయలలిత) అభిమానులు మర్చిపోలేని చిత్రంగా మిగిలిపోతుందనటంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: