టాలీవుడ్, కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించిన దర్శకులు మురగదాస్ తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘దర్భార్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే గజిని, స్టాలిన్, తుపాకీ, సర్కార్  లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన మురగదాస్ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. సంక్రాంతికి విడుద‌ల కానున్న ఈ మూవీకి సంబంధించిన లిరిక్స్, టీజర్ దుమ్మురేపాయి.  తాజాగా దర్భార్ మూవీకి సంబంధించి తెలుగు, తమిళ వర్షన్ లో ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.  వాడు పోలీసాఫీసరా సర్..హంతకుడు..ఆదిత్యా అరుణాచలం కమిషనర్ ఆఫ్ ముంబై అనే సంభాషణలతో మొదలై.. గేమ్ ఆడుతున్నారా.. సార్ వాళ్లతో చెప్పండి పోలీసుల వద్దకు లేఫ్ట్ లో రావొచ్చు.. రైట్ లో రావొచ్చు.. కానీ స్టేట్ గా రావొద్దని..  ‘ఆ చూపేంటి.. ఒరిజినల్‌గానే విలన్‌నమ్మా.. ఇదెలా ఉంది.. ఐయామ్‌ ఏ బ్యాడ్‌ కోప్‌’ అని రజనీ పలికించే హావభావాలు హైలైట్‌గా నిలిచాయి.

 

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ఆ మద్య  రజినీ నటించిన కబాలి, కాలా అంచనాలు అందుకోలేక పోయాయి.  ఇటీవల వచ్చిన పెటా కాస్త పరవాలేదు అనిపించింది.  తాజాగా మురగదాస్ దర్శకత్వంలో వస్తున్న ‘దర్భార్’ పై రజినీ భారీ అంచనాలు పెట్టుకున్నారు.  

 

ఈ ట్రైలర్ చూస్తుంటే నిజంగా పోలీస్ ఆఫీసర్ గా దుమ్ముదుళిపేస్తున్నారు. ఈ మూవీలో రజనీకాంత్ ఇందులో పోలీస్ అధికారి ఆదిత్యా అరుణాచలం పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమ‌కూరుస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. హిందీ నటుడు సునీల్ శెట్టి, యోగి బాబు, తంబి రామయ్య, శ్రీమన్, ప్రతీక్ బబ్బర్, జతిన్ సర్న, నవాబ్ షా, దలిప్ తాహిల్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: