2010 వ సంవత్సరం ముందు వరకు పెద్దగా దేశంలో గ్రాఫిక్స్ కు సంబంధించిన సినిమాలు రాలేదని చెప్పాలి.  గ్రాఫిక్స్ రంగం అప్పటికే దేశంలోకి ప్రవేశించినా... 3డి యానిమేషన్, గ్రాఫిక్స్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు 2007 నుంచి మొదలైంది.  2010 తరువాత సినిమా రంగంలో గ్రాఫిక్స్ ను ఎక్కువగా వినియోగిస్తూ వస్తున్నారు.   బ్లూ మ్యాట్, గ్రీన్ మ్యాట్ లో సినిమాలు తీస్తూ తరువాత గ్రాఫిక్స్ ను వినియోగించి కావలసిన విధంగా బ్యాక్ గ్రౌండ్ తో సినిమాలు తీస్తున్నారు.  


ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా 2010 తరువాత గ్రాఫిక్స్ ను వినియోగించి తీసిన సినిమాలు వరసగా వస్తున్నాయి.  రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా గ్రాఫిక్స్ ను వినియోగిస్తూ వస్తున్నారు.  మగధీర తరువాత తీసిన మర్యాద రామన్న, ఆ తరువాత వచ్చిన ఈగ, తరువాత వచ్చిన బాహుబలి సినిమాల్లో రాజమౌళి గ్రాఫిక్స్ ను ఎక్కువగా వినియోగించారు.  


ఈగ సినిమా కోసం రాజమౌళి చాలా కష్టపడ్డారు.  గ్రాఫిక్స్ లో ఈగను డిజైన్ చేయడానికి పడిన కష్టం అంతాఇంతా కాదు.  ఆ తరువాత రాజమౌళి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు.  బాహుబలి సినిమా కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు.  బాహుబలి రెండు సినిమాలు భారీ విజయాలు సాధించాయి.  తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ సినిమాల్లో కూడా గ్రాఫిక్స్ వినియోగం పెరిగింది.  


సినిమాలో ఎక్కువ భాగం గ్రాఫిక్స్ కోసమే నిర్మాతలు ఖర్చు చేస్తున్నారు.  ఇందుకు ఓ ఉదాహరణ 2పాయింట్ 0.  ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు.  దాదాపుగా రూ. 400 కోట్ల రూపాయల వరకు ఈ సినిమా కోసం నిర్మాతలు ఖర్చు చేసారు అంటే అర్ధం చేసుకోవచ్చు.  ఒకప్పుడు గ్రాఫిక్స్ చాలా కాస్ట్.  కానీ, ఎప్పుడైతే యానిమేటర్లు పరిగిపోయారో అప్పటి నుంచి గ్రాఫిక్స్ కోసం డబ్బు ఖర్చు చేయడం తగ్గిపోయింది.  తక్కువ ధరకే యానిమేటర్లు దొరకడంతో గ్రాఫిక్స్ ను వినియోగిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: