డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైతే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే టైటిల్ పెట్టడం జరిగిందో అప్పటి నుండి వరుసగా అనేక వివాదాలు ఎదుర్కొంటూనే సినిమాని తెరకెక్కించాడు. అయితే టైటిల్ విషయంలో రెండు సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులు రాంగోపాల్ వర్మ దర్శకత్వం పై మరియు ఆయన తీసే సినిమాల పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. కులాలను అడ్డంపెట్టుకుని రామ్ గోపాల్ వర్మ తన లాభాల కోసం మనుషుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నాడు అని రామ్ గోపాల్ వర్మ కి అస్సలు బుద్ధి లేదని అలాంటివాడు సినిమా ఇండస్ట్రీలో ఎలా రాణిస్తున్నాడో ఎవరికి అర్థం కావటం లేదు అంటూ తీవ్ర స్థాయిలో చాలామంది సోషల్ మీడియాలో టైటిల్ పెట్టిన సందర్భంలో విమర్శించటం జరిగింది.

 

ఇదే తరుణంలో ఈ సినిమాకి సంబంధించి టీజర్ మరియు ఫోటోలు విడుదలయ్యాక సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ప్రస్తుత రాజకీయ నాయకులను తలపించే విధంగా సినిమాలో పాత్రలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. అయితే సినిమాలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే ఏ పాల్ పాత్రని పోలిన పాత్ర ఉన్నట్లు తేలడంతో కె ఏ పాల్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. రామ్ గోపాల్ వర్మ ని ముప్పుతిప్పలు పెట్టి సరిగ్గా సినిమా విడుదల విషయంలో హైకోర్టును ఆశ్రయించి దాదాపు రెండు వారాల పాటు టైటిల్ మారిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' బయటకు రాకుండా ఆపడం జరిగింది.

 

అయితే న్యాయస్థానాల చుట్టూ మరియు ఇంకా అనేక రీతులుగా పోరాడిన రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు సినిమాని డిసెంబర్ 12వ తారీకున విడుదల చేశారు. అయితే ఈ తరుణంలో సినిమాని ఆపాలని చూసిన కే ఏ పాల్ నీ వెక్కిరించినట్లు...సోషల్ మీడియాలో కించపరిచే విధంగా మార్ఫింగ్ ఫోటోలు పెట్టడంతో… రామ్ గోపాల్ వర్మ చేసిన పనిని కె ఏ పాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు రామ్ గోపాల్ వర్మ కి నోటీసులు ఇవ్వడం మనకందరికీ తెలిసినదే. అయితే ఇదే ఘటనలో కె ఏ పాల్ తన ఫోటోలతో పాటు గతంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫోటో ని కూడా ఇలానే చేశాడని చెప్పటంతో రాంగోపాల్ వర్మ జీవితంలో ఇది అతిపెద్ద దెబ్బ పడినట్లే అని ఇలాంటి కేసుల్లో మొండిగా వ్యవహరించే లాయర్లు ఎంటర్ అయితే రాంగోపాల్ వర్మ కెరియర్ కే దెబ్బ అని వార్తలు రావడంతో ఆర్జివి వణికి పోయినట్లు సమాచారం.  కేసు సీరియస్ అయితే తనకి చాలా నష్టం అవుతుందని వార్తలు వస్తున్న తరుణంలో రామ్ గోపాల్ వర్మ బాగా భయపడినట్లు ఫిలింనగర్లో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: