గత ఏడాది  ప్రారంభంలో ఛలో తో సూపర్  హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చినట్లే కనిపించాడు యంగ్ హీరో నాగ శౌర్య. అయితే  ఆతరువాత  ఏకంగా  హ్యాట్రిక్  డిజాస్టర్లును ఖాతాలో వేసుకొని  ఇప్పుడు ఎలాగైనా ఒక్క హిట్టు కోసం  ఎదురుచూస్తున్నాడు.  ప్రస్తుతం నాగ శౌర్య, నూతన దర్శకుడు రమణ తేజ డైరెక్షన్ లో 'అశ్వథ్థామ' అనే చిత్రంలో నటిస్తున్నాడు .  ఈచిత్రంలో ఆయన  సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు.  తన సొంత బ్యానర్ ఐరా  క్రియేషన్స్ నిర్మిస్తున్నఈ చిత్రం  కోసం శౌర్య చాలా  జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దానికి తగ్గట్లు  సినిమా కూడా బానే వస్తుందట.
 
ఇక ఈచిత్రం నాగశౌర్య మనసుకు చాలా దగ్గరైనట్లు వుంది అలాగే  ఎంతో ఇష్టం తో ఆయన  ఈసినిమా చేస్తున్నట్లున్నాడు.  ఎందుకంటే ఈ సినిమా పేరును  తన ఛాతి పైన  టాటూ వేయించుకున్నాడు.  తాత్కాలికంగా కాదు పర్మినెంట్ గా ఉండేలా. మరి ఈ చిత్రమైన శౌర్య కు విజయాన్ని ఇస్తుందో చూడాలి.  మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి  చరణ్ పాకాల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.  వచ్చే ఏడాది జనవరి 31న ఈ చిత్రం విడుదలకానుంది. 
 
ఇక ఈసినిమా తరువాత శ్రీనివాస్ అవసరాలతో  శౌర్య ఓ  సినిమా చేయాల్సి ఉండగా  నూతన దర్శకురాలు  లక్ష్మి సౌజన్య  డైరెక్షన్ లో  కూడా  నటించడానికి ఇటీవల  ఓకే  చెప్పాడు.   ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ రెండు సినిమాల తోపాటు ఇటీవల   మరో కొత్త చిత్రానికి  కూడాసైన్ చేశాడు నాగశౌర్య.  సుబ్రహ్మణ్యపురం  ఫేమ్   సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో నటించడానికి  ఓకే చెప్పాడు.   ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత  శరత్ మరార్ సంయుక్తం గా ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: