విజయ్ దేవరకొండ కెరియర్ ను పరిశీలిస్తే అతడికి ఇప్పటి వరకు రియల్ బ్లాక్ బస్టర్ హిట్స్ మూడు మాత్రమే. ‘గీత గోవిందం’ తరువాత విజయ్ దేవరకొండ కోరుకునే బ్లాక్ బస్టర్ హిట్ రాలేదు సరికదా మూడు వరస ఫెయిల్యూర్స్ కూడ వచ్చాయి. 

ఇలాంటి పరిస్థితులలో విజయ్ దేవరకొండకు ఇన్ స్టా గ్రామ్ లో రోజురోజుకు పెరిగి పోతున్న మ్యానియా టాలీవుడ్ టాప్ హీరోలను కూడ ఆశ్చర్య పరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సెలెబ్రెటీ క్రేజ్ ను అతడికి ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ కు ఫాలోయర్స్ సంఖ్యను బట్టి నిర్ణయిస్తున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఇన్ స్టా గ్రామ్ లో ఫాలోయర్స్ సంఖ్య ఐదు మిలియన్స్ స్థాయికి చేరుకుంది. అయితే ఇంకా టాలీవుడ్ ప్రిన్స్ గా సూపర్ స్టార్ ఇమేజ్ ని అందుకున్న మహేష్ కు నాలుగు మిలియన్స్ స్థాయిలో ఫాలోయర్స్ ఉంటే స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న అల్లు అర్జున్ కు నల‌భై ఎనిమిది ల‌క్ష‌ల స్థాయిలో మాత్రమే ఫాలోయ‌ర్లు ఉన్నారు. దీనితో ఇంత తక్కువ కాలంలో విజయ్ దేవరకొండకు ఇంత భారీ స్థాయిలో ఫాలోయర్స్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో ఏర్పడటం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

‘డియర్ కామ్రేడ్’ పరాజయం తరువాత కూడ విజయ్ దేవరకొండ మ్యానియా ఇలా కొనసాగడం చూస్తున్న వారు ఫిబ్రవరిలో రాబోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంచనాలకు అనుగుణంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే చాలు విజయ్ టాప్ 5 యంగ్ హీరోల లిస్టులో చేరిపోవడం ఖాయం అని అంటున్నారు. ఫిబ్రవరి 14న విడుదల కాబోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలోని హీరోయిన్స్ పాత్రల లుక్స్ ఇప్పటికే యూత్ కు బాగా కనెక్ట్ కావడంతో  ఐశ్వర్య రాజేష్ ఇజబెల్లె కేథరిన్ రాశి ఖన్నాల పాత్రలు జనానికి బాగా పరిచయం కావడంతో వరల్డ్ ఫేమస్ లవర్ పై అంచనాలు పెరిగి పోతున్నాయి..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: