మాస్ సినిమాల‌కి పెట్టింది పేరు బాల‌య్య‌. బాల‌కృష్ణ సినిమా అంటే చాలు ఫైట్లు, క‌త్తులు, న‌ర‌క‌డాలు ఇలాంటివ‌న్నీ ఎక్కువ‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తారు ప్రేక్ష‌కులు. అందులోనూ మిగ‌తా హీరోల‌కంటే బాల‌య్య‌కు మాస్ ఫాలోయింగ్ కాస్త ఎక్క‌వ‌నే చెప్పాలి. బాల‌య్య సినిమాలో ర‌క్తం క‌నిపించ‌కుండా, క‌త్తులు క‌నిపించ‌క‌పోతే ప్రేక్ష‌కుల‌కు సినిమా చూసి న‌ట్లే ఉండ‌దు. ఎప్పుడో వచ్చిన సమరసింహారెడ్డి నుంచి నిన్న మొన్నటి జైసింహా వరకు అదే వ్యవహారం.

 

లేటెస్ట్ గా విడుదల అవుతున్న రూలర్ సినిమా కూడా ఇందుకు అతీతం ఏమీ కాదట. బోయపాటి సినిమాలు గుర్తుకు వచ్చే రేంజ్ లో ఫైట్లు చొప్పించారట ద‌ర్శ‌కుడు కె.ఎస్. ర‌వికుమార్‌. ఇందులో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌ల‌చిందేమిటంటే ఈ సినిమాలో ఓ ఫైట్ ను ఏకంగా ఎనిమిది నిమషాల పాటు కొన'సాగు'తుందని బోగట్టా. ఈ ఫైట్ నిరాటంకంగా ఎనిమిది నిమషాల పాటు కొనసాగితే ఆడియన్స్ ఏమేరకు ఆస్వాదిస్తారన్నది చూడాలి. ఇదే కాదు, సినిమాలో మరో రెండు ఫైట్లు కూడా ఈ మేరకు నిడివితోనే వుంటాయని తెలుస్తోంది.

 

ఈ రోజు సెన్సారు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కొన్ని కట్స్, కొన్ని మ్యూట్స్ చెప్పారు. కానీ సర్టిఫికెట్ ఇంకా ఇవ్వలేదు. రేపు ఇస్తారు. సిజి వర్క్ లు బాగానే వున్నాయని, బాలయ్య కు విగ్ లు బాగానే సెట్ అయ్యాయని సెన్సారు తరువాత వినిపిస్తున్న మాట. ఇక తెర మీద చూస్తేనే గాని అస‌లు విష‌యం తెలియ‌దు. ఇందులో బాల‌య్య‌కు జోడీగా సోనాల్ చౌహాన్‌, వేదిక న‌టిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ అందించిన మ్యూజిక్ కూడా మంచి స్పంద‌నే వినిపిస్తోంది. మ‌రి బాల‌య్య ఇందులో డ్యూయ‌ర్ రోల్ లో క‌నిపించ‌బోతున్నార‌ని కొంత మంది. మొత్తం మూడు పాత్ర‌ల్లో అని కొంత మంది భావిస్తున్నారు. అస‌లు విష‌యం తెలియాలంటే సినిమా విడుద‌ల వ‌ర‌కు వేచి చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: