తెలుగు లో వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా గోవా హాట్ బ్యూటీ ఇలియానా జంటగా నటించిన ‘దేవదాసు’ మంచి విజయం సాధించింది.  ఈ మూవీలో ఇలియానా తన నడుం వొంపులతో కుర్రాళ్లనే కాదు.. అప్పటి స్టార్ హీరోలను కూడా గిలిగింతలు పెట్టింది.  దాంతో వరుస ఛాన్సులతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.  తెలుగు, తమిళంలో నటిస్తున్న ఈ గోవా బ్యూటీ మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ కి పయణం అయ్యింది.  కానీ అక్కడ దారుణమైన ఫలితాలు పొందింది.  బాలీవుడ్‌ మీద ఆశలతో సౌత్‌ సినిమాను పక్కన పెట్టి ఈ బ్యూటీ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయింది. అప్పటికే తెలుగు లో కొత్త హీరోయిన్ల జోరు పెరిగిపోవడంతో అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఛాన్సులు లేక కొన్నాళ్లు ఫోటో షూట్స్ తో కాలం గడిపింది. 

 

విదేశీ ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూతో కొంతకాలం ప్రేమాయణం నడిపింది.  ఇటీవల లవ్ బ్రేకప్ కావడంతో మళ్లీ సినిమాల్లోకి రావాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.  ఈ నేపథ్యంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహరాజ రవితేజ నటించిన ‘అమర్ అక్భర్ ఆంథోని’ మూవీలో నటించింది.  అయితే ఒకప్పుడు సన్నగా మెరుపుతీగలా ఉన్న ఇలియానా బొద్దుగా అయ్యిందని టాక్ వచ్చింది.  ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ ఇలియానాకు పెద్దగా అవకాశాలు లేవు. ఒకటి రెండు సినిమాల్లో ఏ మాత్రం ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తుంది.

 

తాజాగా ఈ హాట్ బ్యూటీకి ఓ అదృష్టం కలిసి వచ్చింది. కోలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఓ టాప్‌ స్టార్‌ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించనుంది. టాప్‌ హీరో అజిత్‌ హీరోగా ఖాకీ ఫేం హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాలిమై పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో ఇలియానాకు అవకాశం వచ్చింది. మొదట యామీ గౌతమ్ అనుకున్నప్పటికీ ఫైనల్‌గా ఇలియానాను తీసుకున్నారు చిత్రయూనిట్‌. మరి ఈ సినిమాతో అయిన ఇలియానా అదృష్టం మారుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: