సినీ  కథా రచయిత చిన్ని కృష్ణ నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్  స్థాపించిన ఆయ‌న ఆయ‌న ఇద్ద‌రు కుమారులు  చిరంజీవి, సాయి బద్రీనాథ్ ల‌ను నిర్మాత‌లుగా ప‌రిచ‌యం చేస్తున్నారు. కింగ్ ఫిషర్ వంటి ఎమోషనల్ యాక్షన్ అండ్‌ ఎంటర్ టైనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఓయంగ్ అండ్  టాలెంటెడ్ దర్శకుడిని ఎంపిక చేసిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తి వివ‌రాలు వెల్ల‌డించాల్సి ఉంది.  ఇదిలా ఉండ‌గా చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ లోగో, కింగ్ ఫిష‌ర్ టైటిల్‌ ఆవిష్క‌ర‌ణ‌ కార్యక్రమం సోమ‌వారం  హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత వేడుకగా జరిగింది.

 

 ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు రాజకీయ, ఇతర రంగాలకు చెందినవారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంపి రంగురామకృష్ణంరాజు, ప్రముఖ సీనియర్ దర్శకులు బి.గోపాల్, ప్రముఖ రచయితలు వి.వి.విజయేంద్రప్రసాద్, పరచూరి గోపాలకృష్ణ, యువదర్శకుడు కె.యస్.రవీంద్ర {బాబీ}, మాధవ్ పట్నాయక్ (కంజూమర్ కోర్ట్ జడ్జి), నిర్మాతలు రాధామోహన్, దాసరి కిరణ్, కత్తి మహేష్, హీరో అవీష్, బాలకృష్ణ అభిమాని జగన్ పాల్గొన్నారు.

 

చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ లోగోని వి.వి.విజయేంద్రప్రసాద్, పరచూరి గోపాలకృష్ణ, బి.గోపాల్ ఆవిష్కరించారు. అనేక చిత్రాలకు కథలు అందించిన చిన్నికృష్ణ స్టూడెంట్ స్థాపించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో చిన్నికృష్ణను మించిన క‌థార‌చ‌యిత లేడని సౌత్ ఇండియా చిత్ర సీమ‌లో టాక్ ఉంది. ఆయన రచించిన నరసింహ, నరసింహ నాయుడు, ఇంద్ర సినిమా వంటి సినిమాల క‌లెక్ష‌న్లు చూస్తే అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది.

 

సౌత్ ఇండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కెరీర్‌లోనే నరసింహ సినిమాకు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. క‌థ క‌థ‌నంతో టాప్ లేపారు చిన్నికృష్ణ‌. ర‌జ‌నీకాంత్ టాప్ 5సినిమాల్లో న‌ర‌సింహ ఒక‌టి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే బాల‌కృష్ణ‌కు న‌ర‌సింహ‌నాయుడు అందించి  బాల‌కృష్ణ సినీ కెరీర్‌ను తార‌స్థాయికి తీసుకెళ్లారు. ఇక ఇంద్ర‌తో మెగాస్టార్ చిరంజీవిని ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో ఉన్న హీరోను తెర‌మీదే క‌నిపించేలా చేశారు. ఇంద్ర సినిమా కూడా మెగాస్టార్‌కు ఓ మైలురాయిగా నిలిచిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: