ప్రస్తుతం కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ వరుస విజయాలతో ముందుకు దూసుకొని పోతున్నాడు. తాజాగా  ఈ టాప్‌ హీరో విజయ్‌  మరో అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో జమచేసుకున్నాడు. కోలీవుడ్‌లో ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ మూవీ బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డ్‌ను బద్దలుకొట్టాడు అంటే నమ్మండి.

 

తాజాగా  విజయ్‌ హీరోగా వచ్చిన చిత్రం బిగిల్‌. ఈ సినిమా  అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ విజయం సొంతం చేసుకుంది చిత్ర బృందం. గతంలో అట్లీ విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తేరి, మెర్సల్ సినిమాలను మించి విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి  కాసుల వర్షం కురిపించింది. ఇంకా తమిళనాడులో  కూడా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో హౌసేఫుల్ కలెక్షన్లు సొంతం చేసుకుంది  బిగిల్‌. ఈ సినిమా మన తెలుగులో విజిల్‌ పేరుతో రిలీజ్‌ కూడా అవ్వడం జరిగింది.

 

ట్రిపుల్‌ సెంచరీ సాధించిన విజయ్‌గా నిలిచుయిపోయాడు ఈ సినిమాతో. సౌత్‌ ఇండస్ట్రీలో  బాహుబలి తరువాత ఒక్క రజినీకాంత్ కు   మాత్రమే దక్కిన ఈ రికార్డ్‌ను ఇప్పుడు విజయ్‌ కూడా వాళ్ళ  లిస్టులో చేరాడు అని అర్థం అవుతుంది. ఈ విజయం చూస్తుంటూనే అర్థం అవుతుంది కోలీవుడ్‌లో విజయ్‌ కు  ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది అని. ఈ విజయంతో   విజయ్‌ తదుపరి చిత్రంపై మరింత భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రజలు. ఖైదీ సినిమాతో సూపర్‌ హిట్ సాధించిన లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమాలో విజయ్‌ హీరోగా రాబోతున్నాడు.

 

ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. బిగిల్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేయటం ఖాయం అని సినీ వర్గాలు తెలియచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 వేసవికి రిలీజ్‌ చేసేందుకు ప్రణాలికను సిద్ధం చేసుకుంది చిత్ర బృందం.

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: