ఈ మద్య సినీ పరిశ్రమలో పైరసీ ఎంత ఘోరంగా ఉందంటే.. చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా థియేటర్లో రిలీజ్ అయిన గంటల్లోనే నెట్టింట్లో ప్రత్యేక్షం అవుతుంది.  పైరసీని అరికట్టేందుకు ప్రభుత్వం  సైబర్‌క్రైమ్‌ పోలీసులు, తెలుగు ఫిలిం ఛాంబర్‌లోని పైరసీ వ్యతిరేక కేంద్రం ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఎక్కువగా తమిళ రాకర్స్ ఈ పైరసీలు వివిధ వెబ్ సైట్స్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఆ మద్య 'అత్తారింటికి దారేది' విడుద‌ల‌కు ముందే హెచ్ డీ వెర్ష‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. మొన్నామ‌ధ్య 'గీత గోవిందం' సినిమా కూడా ఇలానే నెట్ లో వచ్చింది.  'గీత గోవిందం' సినిమాలోని 45 నిమిషాల నిడివి గ‌ల స‌న్నివేశాలు బయలకు వచ్చాయి. అప్పుడప్పుడు లీకు వీరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డం.. శిక్షలు వేయడం కూడా జరుగుతూనే ఉంది.  

 

ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా పైరసీ రక్కసిని మాత్రం అరికట్టలేకపోతున్నారు.  దాని వల్ల కొంత మంది సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.  కొంత మంది స్వార్థం కోసం పైరసీ రూపంలో సినీ పరిశ్రమను దెబ్బతీస్తే దానిపై ఆధారపడి జీవించేవారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందని ఆవేదన చెంతుతున్నారు.  తాజాగా కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య నటించిన ‘వెంకిమామ’ పైరసీ భారిన పడింది. హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన‌ ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు యాజ‌మాన్యం నాలుగు రోజుల క్రితం విడుద‌లైన వెంకీ మామ మూవీని బస్సులో ప్ర‌ద‌ర్శించారు.  

 

ఇది చూసిన వెంకటేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు..అంతేకాదు బ‌స్సు డ్రైవ‌ర్‌ని ప‌ట్టుకొని పోలీసుల‌కి అప్ప‌గించారు. ఈ బ‌స్సు జ‌బ్బ‌ర్ ట్రావెల్స్‌కి సంబంధించిన‌ది అని తెలుస్తుండ‌గా, హైద‌రాబాద్ నుండి మైసూర్ వెళ్ళే స‌మ‌యంలో ఈ సినిమాని ప్ర‌ద‌ర్శించారు.  తాజాగా ట్రావెల్స్‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.  ఆ మద్య నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’  మూవీ సైతం పబ్లిక్ లో సీడిలు అమ్ముతుంటే స్వయంగా పట్టించాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: