మామా అల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్యలు సంక్రాంతి ముందే ‘వెంకీ మామ’ చిత్రంలో హిట్ కొట్టారు. కేయస్‌ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు రీల్ లైఫ్‌లో ‘వెంకీ మామ’ చిత్రంతో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ సినిమాకు ప్ల‌స్ అయింద‌ని చెప్పాలి.

 

అలాగే గత సంక్రాంతికి ఎఫ్‌2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి నెల ముందుగానే మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు సమంత కలిసి నటించిన ‘మజిలీ’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన నాగ చైత‌న్య‌కు కూడా ఈ సినిమా క‌లిసొచ్చింది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగ చైతన్యకు జంటగా రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి వీకెండ్ బాగా వర్కౌట్ అయ్యింది కానీ.. వీక్ డే అయినా సోమవారం కి వచ్చే సరికి ప్రేక్షకుల డ్రాప్ అనేది తగ్గింది.

 

మూడు రోజుల్లో రూ. 17.50 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది వెంకీ మామ.  అయితే మొద‌టి మూడు రోజు బాక్సాఫిస్ వ‌ద్ద స‌త్తా చాటిన ఈ సినిమా నాల్గవ రోజు వ‌చ్చే స‌రికి 50% డ్రాప్ అయ్యింది. నాల్గవ రోజు వెంకీ మామ ఇరి రాష్ట్రాల్లో 2.28 కోట్ల షేర్ సాధించింది. వచ్చిన కలెక్షన్స్ డీసెంట్ గానే ఉన్నాయి కానీ నెక్స్ట్ వీక్ డేస్ ఇంకా తగ్గే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. 

 

‘వెంకీ మామ’ నాలుగు రోజుల ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్ వివరాలు:

 

నైజాం- 7.67 కోట్లు

 

సీడెడ్- 3.58 కోట్లు

 

గుంటూరు- 1.74 కోట్లు

 

ఉత్తరాంధ్ర- 2.68 కోట్లు

 

తూర్పు గోదావరి- 1.28 కోట్లు

 

పశ్చిమ గోదావరి- 1.05 కోట్లు

 

కృష్ణా- 1.29 కోట్లు

 

నెల్లూరు- 0.75 కోట్లు
-------------------------------------------------
ఫస్ట్ 4 డేస్ మొత్తం షేర్- 20.04 కోట్లు
--------------------------------------------------

మరింత సమాచారం తెలుసుకోండి: