ఆయన డైలాగ్ లతో ప్రేక్షకులను మాయ చేయగల సత్తా ఆయన సొంతం... సినిమా తీయాలంటే పేజీలు పేజీలు డైలాగులు అవసరంలేదు చురకత్తుల్లాంటి  కొన్ని డైలాగులు ఉంటే సరిపోతుంది అని నిరూపించిన దర్శకుడు ఆయన... ఎలాంటి కథలోనైనా ప్రేక్షకుడిని ఎక్కడా బోర్ కొట్టకుండా తన డైలాగులతో సగటు ప్రేక్షకుని అలరించగలడు  ఆ దర్శకుడు. ఆయనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. ఆయన కలం నుంచి జాలువారిన సినిమాలు ఎన్నో సంచలన విజయాలను అందుకున్నాయి . ఇక త్రివిక్రమ్ సినిమాలంటే పంచ్ డైలాగులతో హోరెత్తిపోతు ఉంటుంది. అందుకే త్రివిక్రమ్ సినిమాలకి ప్రేక్షకుల్లో అదో సపరేట్ క్రేజ్ ఉంటుంది. 

 

 

 

 అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో   సినిమాని తెరకెక్కిస్తున్నారు. కాగా  ఈ సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ లో కూడా త్రివిక్రమ్ మార్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పంచ్ డైలాగులతో మరోసారి అదరగొట్టారు త్రివిక్రమ్. టాలీవుడ్ లోని అన్ని తరగతుల ప్రేక్షకులను అలరించే విధంగా త్రివిక్రమ్ సినిమాలు ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్ లో ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా పెద్ద పెద్ద హీరోలతో వరుస సినిమాలు చేస్తూ ఉన్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ . ప్రస్తుతం అల్లు అర్జున్ తో  అలా  వైకుంఠపురములో   సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్... తన తర్వాత సినిమా ఎన్టీఆర్ తో  చేయనున్నట్లు సమాచారం. 

 

 

 

 గతంలో ఇద్దరికీ ఒక మంచి హిట్ కాంబినేషన్ ఉందని చెప్పాలి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ ని ఒక రేంజ్ లో షేర్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ భారీ విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమా. కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి సినిమా చేస్తున్నారు అంటే వేరే సినిమా చేయడానికి రాజమౌళి యాక్సప్ట్  చేయరు కాబట్టి రాజమౌళి సినిమా పూర్తయిన తర్వాతనే.. మరోసారి త్రివిక్రమ్ తో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మధ్య చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. త్రివిక్రమ్ తో సినిమా అంటే దాదాపు విజయానికి దగ్గర లో ఉన్నట్లే. ఇక దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ తోడైతే మరోసారి బాక్సాఫీస్ షేక్ కావడం పక్క అరే నందమూరి అభిమానులు భావిస్తున్నారట. అరవింద సమేత భారీ హిట్ తర్వాత ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: