టెక్నాలజీ రావటం వల్లనో లేకపోతే స్మార్ట్ ఫోన్ అందరికి అందుబాటులో ఉండటం వల్లనో తెలియదు గాని చాలా మంది మగవాళ్ళు మృగాలుగా సమాజంలో ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఆడవాళ్లపై అత్యాచారాలు హత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్న కొత్త చట్టాలు వస్తున్నా మగ వారి ఆలోచనలో మాత్రం కొద్దిగా కూడా మార్పు రావటం లేదు అనటానికి తాజాగా జరిగిన ఈ సంఘటన నిదర్శనం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశ యాక్ట్ చట్టం తీసుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎవరైనా ఆడవాళ్లపై అఘాయిత్యాలకు అత్యాచారాలకు పాల్పడితే సంబంధిత కేసు 21 రోజుల్లో కంప్లీట్ చేసి ఆ కేసులో ఉన్న నిందితుడిని కేసు గనక రుజువైతే ఉరిశిక్ష వేయాలని చట్టం తీసుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. 

 

తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మండలంలోని ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన  బాలికపై అదే గ్రామానికి చెందిన వివాహితుడు వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. బాలిక అదే గ్రామంలో పాఠశాలలో జరుగుతున్న నేపథ్యంలో తండ్రి విదేశాల్లో ఉండటంతో పిల్లల బాధ్యతను తల్లి చూసుకుంటుంది. గ్రామానికి చెందిన వివాహితుడు ఆ ఇంటికి తరుచూ వెళ్లడం, ఇంటి పేరు ఒకటే కావడంతో వారిలో ఒకడిగా కలిసిపోయాడు. ఇంటికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులను అప్పుడప్పుడు తెచ్చి ఇచ్చేవాడు.

 

ఈ క్రమంలో ఆ కుటుంబానికి మరింత దగ్గరై వరుసకు చెల్లి అయ్యే 13 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పాడు. బాలిక స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో అసభ్యకర చిత్రాలను తీశాడు. పసుపు తాడు కూడా కట్టాడు. పెళ్లి చేసుకున్న ఆ దృశ్యాలను తండ్రి వాట్సాప్‌కు పంపాడు. బాలికకు, తల్లికి వెంటనే తండ్రి ఫోన్‌ చేసి ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో గ్రామంలో ఈ విషయం సంచలనంగా మారడంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అయితే నిందితులు పలుమార్లు రేప్ చేయడానికి కూడా పాల్పడినట్లు బాలిక పోలీసులు వద్ద వాపోయినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: