రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా సేపేరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు ప్రభాస్. బాహుబలి ముందు వరకూ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా ఉన్న ప్రభాస్ ఈ సినిమాతో జాతీయ స్థాయి సినిమా దృష్టిని ఆకర్షించాడు. బాహుబలి2 తో ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయిపోయాడు. జాతీయస్థాయిలో బాహుబలి సృష్టించిన మాయాజాలం అంతా ఇంతా కాదు. జాతీయస్థాయి యాడ్స్ కూడా ప్రభాస్ ఖాతాలో వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్ ఉన్న జోన్ ని ఒక్కమాటలో చెప్పాలంటే.. పాన్ ఇండియా సబ్జెక్టు అయినా చేయాలి.. మామూలు కథని జాతీయ స్థాయిలో తెరకెక్కించాలి.

 

 

బాహుబలి, సాహో సినిమాలతో నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తో సినిమా చేసేందుకు సౌత్ నుంచి నార్త్ వరకు ఎంతో మంది దర్శక నిర్మాతలు  ప్రయత్నిస్తున్నారు. ప్రభాస్ తో జాతీయస్థాయిలో సినిమా చేయాలని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సైతం ఆలోచిస్తున్నాడు. ఇందుకు సంబంధించి ప్రయత్నాలు కూడా జరిగాయని సమాచారం. ప్రస్తుతం రాజకీయ నాయకులు సైతం ప్రభాస్ తో సినిమాలు చేయాడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణకు చెందిన ఓ బీజేపీ ఎంపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు సినిమా అనుభవం ఉన్న వ్యక్తితో భాగస్వామిగా మారనున్నారని అంటున్నారు.

 

 

ప్రభాస్ తో సినిమా తీయాలంటే 100 కోట్ల బడ్జెట్ కూడా ఇప్పుడు చిన్న మొత్తంలా ఉంది పరిస్థితి. సాహో తెలుగులో ప్లాప్ అయినా బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టటం ఇందుకు ఓ ఉదాహరణ. దీంతో ప్రభాస్ సినిమాకు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడటం లేదు. మరి ప్రభాస్ ఎవరికి అవకాశం ఇస్తాడో ప్రభాస్ రేంజ్ ఇంకెంతవరకూ పెరుగనుందో చూడాలి. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న జాన్ సినిమా కూడా జాతీయస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: