ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎవరి ఇష్టం వచ్చినట్లు ఎవరిపై మీదైనా కామెంట్స్ చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు.  తాము సెన్సేషన్ కావడానికి ఎన్నో మార్గాలు ఎంచుకుంటున్నారు.  ఇప్పుడు ఇదే సంఘటన బాలీవుడ్ జరిగింది.   మాజీ ప్రధాని నెహ్రూపై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన నటి పాయల్ రోహత్గీ  ఐటి చట్టంలోని 66, 67 సెక్షన్ల కింద.. రాజస్థాన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం బుండి కోర్టులో పాయల్‌ను ప్రొడ్యూస్ చెయ్యగా..8 రోజుల జ్యూడిషియల్ కస్టడీని విధించింది కోర్టు.  బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, రాజస్థాన్ బుండీలోని స్థానిక కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.  జవహర్ లాల్ నెహ్రూపైనా, ఆయన కుటుంబసభ్యులపైనా పాయల్ రోహాత్గీ వ్యాఖ్యలు చేయడమే అరెస్ట్ కు దారితీసింది.

 

నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ కుటుంబాన్ని, ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ అర్ధాంగిపై రోహాత్గీ వ్యాఖ్యలు అసభ్యంగా ఉన్నాయని రాజస్థాన్ యువజన కాంగ్రెస్ నేత చర్మేశ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీ చట్టం అనుసరించి పోలీసులు పాయల్ రోహాత్గీని అదుపులోకి తీసుకున్నారు. తన అరెస్ట్ అనంతరం పాయల్ ట్విట్టర్‌లో స్పందించారు. మోతీలాల్ నెహ్రూపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సమాచారాన్ని గూగుల్ నుంచి సేకరించి నన్ను అరెస్ట్ చేశారు.

 

దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఓ జోక్‌గా మారింది అని పాయల్ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. బెయిల్ పిటిషన్‌ సమర్పించగా న్యాయమూర్తి సానుకూలంగా స్పందిచారు. అనంతరం ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా డిసెంబర్ 16న తిరస్కరించడమే కాకుండా డిసెంబర్ 24వ వరకు జైలులోనే ఉంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను హీరోయిన్ పాయల్‌కు మంజూరు చేశారు. మంగళవారం సాయంత్రం వరకు ఆమె ఇంకా బెయిల్‌పై బయటకు రాలేదనిది తాజా సమాచారం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: