పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో 'పింక్' రీమేక్ తో రీఎంట్రీ ఇస్తున్నారన్న సంగతి తెలిసిందే. పవన్ అధికారికంగా ఇంకా ఈ విషయాన్ని ప్రకటించకపోయినప్పటికీ సినిమా మాత్రం ఇప్పటికే లాంచింగ్ జరిగిపోయింది. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నివేద థామస్..అంజలి రెండు కీలక పాత్రలు పోషించనున్నారు. అయితే ఈ సినిమాకు పవన్ 20 రోజులు మాత్రమే కాల్ షీట్స్ కేటాయించారన్న టాక్ కొత్తగా వినిపిస్తోంది. అది కూడా ఒక లాంగ్ షెడ్యూల్ కాకుండా పవన్ సౌకర్యాన్ని బట్టి ఆ డేట్స్ కేటాయిస్తారట. దీన్ని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ అందుబాటును బట్టి మిగతా షూటింగ్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని అర్థమవుతోంది. 

 

అయితే నిర్మాత దిల్ రాజుకు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలనేది కల. అందుకే పవన్ కండిషన్స్ కు ఒప్పుకొనే సినిమా చేసేందుకు సరే అన్నారట. అంతే కాకుండా భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరీ పవన్ ను ఒప్పించారట. ఈ సినిమాలో పవన్ పోషించాల్సింది ఒక లాయర్ పాత్ర. దీంతో ఇతర కమర్షియల్ సినిమాల తరహాలో ఎక్కువ శ్రమ ఉండదు. ఎక్కువగా కోర్టులో సాగే డ్రామా కాబట్టి ఒక కోర్టు సెట్ లో పవన్ కు సంబంధించిన మెజారిటీ షూటింగ్ పూర్తి చెయ్యవచ్చు. అందుకే పవన్ కూడా ఈ సినిమాకు ఒకే చెప్పారు. ఇక ఇప్పుడు మరో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. అసలు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సూట్ అవుతారా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫుల్ ఎనర్జీ.. కామెడీ.. ఎంటర్టైన్మెంట్ ను ప్రేక్షకులు కోరుకుంటారన్నది వాస్తవం. 

 

కానీ 'పింక్' సినిమాలో అలాంటి కమర్షియల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు ఏవీ ఉండవు. ఇలాంటి 'పింక్' తరహా సీరియస్ సినిమాలో పవన్ ను ఎంత మాత్రం ఆదరిస్తారు అనేది ఇప్పుడు అందరికి వస్తున్న సందేహం. ఒక కమర్షియల్ సినిమాకు పవన్ సినిమాపై భారీ బడ్జెట్ పెట్టడం సరే కానీ ఈ సినిమా కథ రెగ్యులర్ గా ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే కథ కాదు. కొంచెం కష్టమైన సందేశంతో కూడుకున్న న్యూ జెనరేషన్ కథ. ఈ సినిమా పవన్ స్టైల్ కు సూట్ కాదేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఇలాంటి కథతో పవన్ తో సినిమా చెయ్యడం.. 20 రోజుల డేట్స్ తోనే సర్దుకోవడం లాంటి అంశాలు దిల్ రాజుపై ప్రెజర్ పెంచేవే అని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. మరి ఈ ప్రయత్నంలో దిల్ రాజు ఎంతవరకూ సక్సెస్ అవుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: