మాస్ రాజా రవితేజ , గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో చిత్రం  క్రాక్.  యాక్షన్ ఎంటర్ టైనర్ గా  రానున్న ఈ చిత్రంలో  రవితేజ  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్  పాత్రలో కనిపించనున్నాడు. ఇంతకుముందు రవితేజ పోలీస్ గా నటించిన  దాదాపు అన్ని సినిమాలు  సూపర్ హిట్లు అయ్యాయి. దాంతో  క్రాక్ పై కూడా మంచి అంచనాలు  వున్నాయి.  ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం  పాతబస్తీ లో జరుగుతుంది.  అందులో భాగంగా నైట్ ఎఫెక్ట్ లో రామ్- లక్ష్మణ్  అద్వర్యం లో  ఓ భారీ యాక్షన్  సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. 
 
 
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం  ఇప్పటికే 25శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.  శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా సముద్రఖని , వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా  ఠాగూర్ మధు  నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఇక ఈ చిత్రం కన్నా ముందు  రవితేజ , డిస్కోరాజా  తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్  ప్రొడక్షన్ దశలో వున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 24న విడుదలకానుంది. 
 
 
సైన్టిఫిక్ థ్రిల్లర్ గా ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్  వి ఐ ఆనంద్  తెరకెక్కిస్తున్న  ఈ చిత్రంలో  నాభా నటేష్ , రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ , తాన్యా హాప్  కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్  బ్యానర్ ఫై  రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.  ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ హీరో  బాబీ సింహ విలన్ పాత్రలో నటిస్తుండగా v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: