స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్లుగా ‘అడ్డా’ చిత్రం దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత భార్గవ్ మన్నె నిర్మిస్తున్న చిత్రం “హీరో హీరోయిన్”. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. 

 

తాజాగా ఈ చిత్రం నుండి పర్వట్ సాంగ్ విడుదల చేశారు చిత్ర యూనిట్. అమ్మాయిలను టీజ్ చేస్తూ సాగే ఈ సాంగ్ క్యాచీ గా ఉంది. అనూప్ సంగీతం, పూర్ణ చారి సాహిత్యం బాగుంది. పైరేటెడ్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మీ హీరోల సినిమాలను పైరసీ చేసేది నేనే.. అంటూ ‘హీరో హీరోయిన్’ టీజర్‌తో ఆల్రెడీ సందడి  చేశాడు నవీన్ చంద్ర. ప్రతి మగాడు ప్లేబాయ్., ఛాన్స్ దొరికితే కుక్కలమే., ప్రొడ్యుసర్ కూతురివైతే ఏంటే.. నిన్నూ వదల్ను.. పైరసీని వదల్ను., లాంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేవిగా ఉన్నాయి. ఇక చివర్లో విడుదల రోజునే సినిమాని పైరసీ చేసి నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తున్న ‘తమిళ్ రాకర్’ వెబ్‌ సైట్‌కి హీరో జై కొట్టడం కాస్త వివాదం అయ్యేట్టే ఉంది ‘హీరో హీరోయిన్’ టీజర్. మొత్తానికి సినిమాని దోచేసే బూచోడుగా నవీన్ చంద్ర విభిన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. విభిన్న‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటున్నాడు కానీ ఎందుకు పెద్ద‌గా స‌ర్వైవ్ కాలేక‌పోతున్నాడు.

 


నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, డింపుల్ చొపాడియా, పోసాని కృష్ణ మురళి, 30 ఇయర్స్ పృథ్వి, అభిమన్యుసింగ్, జయప్రకాశ్, గౌతమ్ రాజు, శివన్నారాయణ, బమ్ చిక్ బబ్లూ మొదలగువారు.
సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె,కెమెరా: వెంకట్ గంగాధరీ, ఎడిటర్: జునైద్ సిద్ధికి, ఆర్ట్ – కిరణ్ కుమార్ మన్నె,ఫైట్స్ – రియల్ సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్వంశీ కృష్ణ, నిర్మాత: భార్గవ్ మన్నె, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: జి.కార్తీక్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: