ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ వ్యవహారం పూర్తిగా మారిపోయింది. ఎటు చుసిన కొత్త వాళ్లకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు తప్ప పాతవాళ్లను పట్టించుకోవడం లేదనే వార్తలు కూడా వినపడుతున్నాయి. ఇక దర్శక నిర్మాతల విషయానికొస్తే.. వారు కూడా అంతే ఏ గాలి ఈ పడవ అన్నట్లు వ్యవహరిస్తుండటం సహజం. ఒక్క మాట మీద అస్సలికే ఉండటం లేదంటే నమ్మండి. 


ఒకప్పటిట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలు పెద్ద పెద్ద స్టార్లుగా చలామణీ అవుతున్న రోజుల్లో కూడా దర్శకనిర్మాతలు చెప్పిందే జరిగేది. సినిమా నిర్మాణం వాళ్ళ చేతుల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హీరో చెప్పిందే వేదం. తను ఓకే అంటేనే ఏదైనా జరగడం, తను ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే. లేకుండా ఇంకా మూట ముల్లె సర్దుకునే పరిస్థితి ఉంది.  అందుకే అడిగినంత ఇస్తూ కొత్త సినిమాలు చేస్తున్నారు. 

 

ఆ మాటకొస్తే ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పడు సార్ హీరోలయిన మహేష్, బన్నీ, తారక్ లు ప్రస్తుతం రెమ్యునరేషన్ 45 కోట్ల వరకు తీసుకుంటున్నారు. సినిమా బడ్జెట్ మొత్తం 100 కోట్లు అవుతుండగా ఇందులో మహేష్ ఒక్కడికే దాదాపుగా సగం చెల్లించుకోవాల్సిన పరిస్థితి.

 

అందుకే సినిమా బడ్జెట్లు అదుపుతప్పి పోతున్నాయి. ఇంత ఇంత బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసి ఒకవేళ సినిమాకు బ్యాడ్ టాక్ వస్తే డిస్ట్రిబ్యూటర్లు పూర్తిగా నష్టపోతారు. అప్పుడు వాళ్ళు న్యాయం చేయమని నిర్మాతల తలుపే తడతారు. కానీ హీరో దగ్గరకి ఒక్కరు కూడా వెళ్లరు. భారీ బడ్జెట్ ల కారణంగా సినిమాలు హిట్ అయినా నిర్మాతలకు మహా అయితే ఒక ఐదారు కోట్లు మిగులుతోన్న పరిస్థితి. అది కూడా పాత సినిమా సర్దుబాట్లకు వెళ్ళిపోతుంది.ఇప్పుడు ఓ ప్రముఖ నిర్మాత మాత్రం మాట మార్చాడట. 

 

హీరోను బట్టి ఈ నిర్మాత రేటుపెంచుతుండటం జరుగుతూ వస్తుంది. అందుకే అతని సినిమాలు ఎప్పుడో కానీ ఓవర్ బడ్జెట్ వెళ్లవు. మహేష్ తో మహర్షి తీసినప్పుడు కూడా తనకు 25 కోట్ల పారితోషికం చెల్లించాడు. కానీ పింక్ రీమేక్ కు పవన్ ను తీసుకురావడానికి తన సిద్ధాంతాలను పక్కన పెట్టి మరీ భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయ్. పింక్ రీమేక్ కోసం పవన్ 21 రోజుల కాల్ షీట్స్ ఇస్తే 50 కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేసాడు దిల్ రాజు. దీంతో సినిమాలపై ఆసక్తి లేకపోయినా కానీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ముందుకొచ్చాడు పవన్. ఇండస్ట్రీలో నిర్మాతల నిర్మాతల సిద్ధాంతాల గురించి మాట్లాడే దిల్ రాజు, పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఇలా లొంగిపోవడం ఏంటని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: