రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసి యంగ్ రెబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో ప్రభాస్. ఈ దశాబ్ధంలో ప్రభాస్ కెరియర్ గ్రాఫ్ చూస్తే షాక్ అవడం ఖాయం. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు పార్టులు ప్రభాస్ రేంజ్ ఏంటో చూపించాయి. 2010 లో డార్లింగ్ సినిమాతో హిట్ అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

 

రెబల్ లాంటి సినిమా షాక్ ఇచ్చినా సరే మళ్లీ మిర్చితో సూపర్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. ఇక ఐదేళ్ల కెరియర్ ఫణంగా పెట్టి ప్రభాస్ చేసిన బాహుబలి పార్ట్ 1, 2 అతనికి నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చేలా చేసింది. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి రెండు పాత్రల్లో ప్రభాస్ చూపించిన అభినయానికి భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

 

ఇక ప్రభాస్ రికార్డుల మోత గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రభాస్ సినిమాలు ఇష్టపడతారు. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడిగా ప్రభాస్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ దశాబ్ధంలో మిర్చితో తన కెరియర్ బెస్ట్ హిట్ అందుకున్నాడని అనుకునేలోపే బాహుబలితో తెలుగు సినిమాకు ఒక ప్రత్యేకమైన సంతకంగా మారాడు మన బాహుబలి ప్రభాస్.

 

బాహుబలితో బాలీవుడ్ హీరోలకు సైతం వెన్నులో వణుకు పుట్టించిన ప్రభాస్ సాహోతో కూడా అక్కడ సత్తా చాటాడు. బాహుబలి తర్వాత సినిమా కావడంతో భారీ అంచనాలతో వచ్చిన సాహో తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు కాని బాలీవుడ్ లో మాత్రం సాహో కూడా సెన్సేషనల్ హిట్ అందుకుంది. తెలుగు హీరోలకు బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ రావడం చాలా అరుదు అలాంటిది ప్రభాస్ కు బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ ఏర్పడింది. అందుకే ఇక మీదట ప్రభాస్ ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: