నందమూరి అభిమానుల అండదండలతో హీరోగా సత్తా చాటుతూ వస్తున్న జూనియర్ ఎన్.టి.ఆర్. తన ప్రవర్తన మాట తీరుతో మరింత ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బాలరామాయణంతో బాలనటుడిగా అలరించిన ఎన్.టి.ఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా చేశాడు. నూనూగు మీసాల వయసులోనే ఆది, సింహాద్రి లాంటి సెన్సేషనల్ హిట్లు అందుకున్న తారక్ నందమూరి వారసత్వాన్ని తన మీద వేసుకున్నాడని చెప్పొచ్చు.

 

కొన్నాళ్లు కెరియర్ పరంగా వెనుకపడ్డ తారక్ టెంపర్ తో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. సినిమాల్లోనే కాదు రాజకీయ చర్చల్లో కూడా ఎన్.టి.ఆర్ ప్రస్థావన రాక మానదు. రాజకీయ చర్చల్లో తనని బుడ్డోడు అంటూ సంభోదిస్తారని ఇన్నర్ టాక్. ఈమధ్య వచ్చిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో కూడా వర్మ ఈ విషయంపై సెటైర్ వేశాడు. అయితే తనని బుడ్డోడు అన్న వారికి తారక్ నటించిన రామయ్య వస్తావయ్య సినిమాలో ఒక డైలాగ్ కొడతాడు.

 

బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా అని అంటాడు.. అలా పిలవాలంటే తన అభిమానై ఉండాలని అంటాడు. అయితే ఆ డైలాగ్ చెప్పిన తారక్ కెరియర్ పరంగా పుంజుకోవడమే కాదు మళ్లీ రాజకీయాలకు తను దూరంగా ఉన్నా భవిష్యత్తులో పార్టీకి తన అవసరం తప్పకుండా ఉంటుందనేలా సత్తా చూపిస్తున్నాడు. ఒకానొక దశలో తనని అణగదొక్కాలని చూసినా మళ్లీ రెట్టింపు ఉత్సహంతో సినిమాలు హిట్టు కొట్టాడు ఎన్.టి.ఆర్. 

 

తన ప్రవర్తనతో తనని అభిమానించే వారినే కాదు తనని ధ్వేషించే వారిని కూడా తనని మెచ్చేలా చేసుకుంటున్నాడు తారక్. ఎప్పటికైనా టిడిపి పగ్గాలు జూనియర్ చేతికి వస్తాయన్నది రాజకీయ వర్గాల టాక్. అయితే ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. పదేళ్ళ వరకు పాలిటిక్స్ జోలికి వెళ్ళకూడదు అని తారక్ నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో సూపర్ ఫాం లో ఉన్న తారక్ రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు.    

మరింత సమాచారం తెలుసుకోండి: