త్రివిక్రమ్- బన్నీ కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ సినిమా విడుదలైన పాటలు, టీజర్ సినిమా మీద అంచనాల్ని మరింత పెంచాయి. త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ముగించుకుని సంక్రాంతి కానుకగా జనవరి ౧౨ వ తేదీన విడుదలకి సిద్ధం అవుతోంది.

 

 

అయితే టీజర్ సినిమా విడుదల అయినప్పటికీ ఈ సినిమా కథ ఏంటనే చర్చ ప్రతీ ఒక్కరిలో మొదలైంది. ఈ మూవీ కథపై ఊహాగానాలు నడుస్తున్నాయి. ఐతే బన్నీ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా  అలాగే మాస్ విలేజ్ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. అసలు రెండు గెటప్స్ లో కనిపిస్తున్న బన్నీ రోల్ పై ఇండస్ట్రీలో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. ఈ రెండు గెటప్స్ లో బన్నీ చాలా స్టైలిష్ గా కనబడుతున్నాడు.

 

 

 ఐతే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రంలో అమాయకుడు, సాఫ్ట్ పర్సనాలిటీ అయిన సుశాంత్ కి హెల్ప్ చేయడానికి వస్తాడని సమాచారం. సుశాంత్ తో ఉన్న స్నేహం కారణంగా  అతనిపై జరుగుతున్న కుట్రను, ప్రత్యర్థుల ఆట కట్టించడానికి బన్నీ సుశాంత్ కి అండగా రంగంలోకి దిగుతాడట. అలాగే వైకుంఠపురం అనబడే పేరుగల ఇంట్లోకి బన్నీ ఎందుకు వెళ్తాడనేది ఆసక్తిగా ఉంటుందట.

 

అందుకే మాస్ బ్యాగ్ గ్రౌండ్ ఉన్న మధ్య తరగతి కుటుంబానికి చెందిన బన్నీ..సుశాంత్ కొరకు క్లాస్ గా నటిస్తాడట. అల్లు అర్జున సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే తమిళ నటుడు సముద్రఖని విలన్ గా కనిపించనున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: