ముఖానికి రంగేసుకున్నోళ్లు రాజకీయాలకు పనికిరారంటూ అన్న నోళ్లు మూసుకునేలా అన్న ఎన్.టి.ఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించి పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఎన్.టి.ఆర్ కన్నా ముందే ఎం.జి.ఆర్ కూడా సినిమా గ్లామర్ తో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు.

 

ఎం.జి.ఆర్, ఎన్.టి.ఆర్ తర్వాత ఆ రికార్డ్ ఒక్క జూనియర్ ఎన్.టి.ఆర్ కు మాత్రమే సాధ్యమయ్యేలా ఉంది. సినిమా గ్లామర్ తో రాజకీయాల్లో రాణించాలని అనుకునే వారు చాలామంది ఉన్నారు. అయితే అలాంటి వారికి స్పూర్తి మాత్రం ఎం.జి.ఆర్.. ఎన్.టి.ఆర్. తమకు ఉన్న సినిమా క్రేజ్ తో ఏదో ఒక పార్టీలో చేరి పదవులు చేపట్టడం వేరు.. సొంత పార్టీ పెట్టి జనాకర్షణ సాధించడం వేరు. 

 

ఈ దశాబ్ధ కాలంలో ఇద్దరు ముగ్గురు అలానే తమ సినిమా ఫంక్షన్స్ కు వచ్చే అభిమానులంతా తమ వెనుకే నడుస్తారని సొంత పార్టీ పెట్టి ఎలక్షన్స్ లో నిలబడ్డారు. వారికి వచ్చిన ఫలితం ఏంటో అందరికి తెలిసిందే. అయితే ఎం.జి.ఆర్, ఎన్.టి.ఆర్ తర్వాత తారక్ మాత్రమే సిఎం అయ్యే అవకాశం ఉందని గట్టిగా వినపడుతున్న మాట. ఏపీ రాజకీయాల్లో ఎన్.టి.ఆర్ ఎంట్రీ లేటవ్వొచ్చు కాని ఆ తర్వాత మాత్రం కచ్చితంగా అక్కడ రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయని చెప్పొచ్చు.

 

కచ్చితంగా టిడిపి పగ్గాలు జూనియర్ ఎన్.టి.ఆర్ చేతికి వస్తే తెలుగు తమ్ముళ్లు నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. ఎన్.టి.ఆర్ తర్వాత జూనియర్ ఎన్.టి.ఆర్ కే సిఎం అయ్యే అర్హత ఉందని అభిమానులు అంటున్నారు. మరి ఆరోజు కోసం ప్రతి నందమూరి ఫ్యాన్ ఎదురుచూస్తుంటాడు. అయితే ఆరోజు కోసం మాత్రం కొన్నేళ్ళు వెయిట్ చేయక తప్పదు. ఇక సినిమా నేపథ్యంతో వచ్చి సిఎం అయిన వారిలో జయలలిత ఉన్నారు. ఆమె హీరోయిన్ గా నటించి తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: