ఆయన సినీ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్లు గడిచిపోయింది... ఇక ఆయన సినీ కెరీర్లో ఎన్నో అద్భుత విజయాలను కూడా సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద ఎన్నో  రికార్డును నెలకొల్పాడు ఆ హీరో.. ఆయనకు నాలుగు పదుల వయస్సు కూడా దాటేసింది.. కానీ అందం మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయింది. ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు కు నాలుగు పదుల వయసు వచ్చింది కానీ ఆయన అందం మాత్రం ఇంకా ఇరవై అయిదేళ్ల దగ్గరే ఆగిపోయింది. ఇప్పటికే యువ హీరోలు కూడా మహేష్ బాబు అందం ముందు పనికిరారు. ఇక మహేష్ పేరు వింటే చాలు అమ్మాయిలకు  పూనకం వచ్చేస్తుంది. మహేష్ మహేష్ మహేష్ అంటూ ఈ ఘట్టమనేని వారసుడు జపం చేస్తూ ఉంటారు. 

 

 

 

 ఇక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్నో విజయాలను సొంతం చేసుకుని  దూసుకుపోతున్న మహేష్ బాబు కెరీర్లో.. ఫ్లాప్ అయిన సినిమాలు జాబితా కొన్ని సినిమాలు మాత్రమే ఉంటాయి తప్ప మిగతా అన్ని బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజ్ లో రికార్డులు నెలకొల్పినవే . బాలనటుడీగా తండ్రి తో నటించి కెరియర్ ప్రారంభించిన మహేష్ బాబు ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ప్రేక్షకుల కౌ బాయ్ గా మారిపోయాడు... ఆ తర్వాత ప్రేక్షకుల రాజకుమారుడు గా మరి ప్రిన్స్ గా పేరుతెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్ గా మారిపోయాడు మహేష్ బాబు. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాడు అని చెప్పాలి. అదే ఫిట్నెస్ అదే అందం. 

 

 

 అందుకేనేమో అమ్మాయిలందరూ మహేష్ జపం చేస్తూ ఉంటారు. నాలుగు పదుల వయస్సు దాటిపోతున్నప్పటికీ ఇప్పటికీ మహేష్ బాబు అందం ముందు   యువ హీరోలు కూడా సాటిరారని చెప్పాలి  ఆనాటి రాజకుమారుడు  నుంచి నేటి సరిలేరు నీకెవ్వరు వరకు.. వన్నె తగ్గని అందం మహేష్ బాబు సొంతం. ఇక మహేష్ బాబు అందం విషయంలో అటు భార్య నమ్రత పాత్ర కూడా ఉందనే చెప్పాలి. మహేష్ బాబు ఎంత బిజీగా ఉన్నప్పటికీ నమ్రత మహేష్ బాబు కోసం చాలా కేర్  తీసుకుంటూ ఉంటుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరో గా దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలతో బాక్సాఫీసును షేక్ చేస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికీ తన అందంతో అందరికీ సవాల్ విసురుతున్నాడు మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: