మహేష్ బాబు ఈ పేరులోనే తెలియని ఏదో వైబ్రేషన్ ఉందని చాలా మంది అమ్మాయిలు చెబుతుంటారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఏ హీరోకు సొంతం కాని లేడీ ఫ్యాన్ బేస్ కేవలం మహేష్ కు మాత్రమే సొంతం. చాలా మంది అమ్మాయిలు ఎలాంటి భర్త కావాలని అడిగితే మహేష్ బాబులాంటి అందమైన భర్త కావాలని చెబుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా ఏ హీరో సినిమా రిలీజ్ అయినా మొదటిరోజు లేడీ ఫ్యాన్స్ తక్కువగానే సినిమాలు చూడటానికి వెళతారు. 
 
కానీ మహేష్ బాబు విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. మహేష్ సినిమా రిలీజవుతుందంటే చాలు లేడీ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడతారు. తొలి సినిమా రాజకుమారుడుతోనే మహేష్ కు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మొదలైంది. సినిమా సినిమాకు ఆ ఫాలోయింగ్ పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. తెలంగాణలోని ఒక లేడీ ఎమ్మెల్సీ కూడా తాను మహేష్ బాబుకు వీరాభిమానినని చెప్పటం గమనార్హం. 
 
మహేష్ బాబుకు పెళ్లై చాలా సంవత్సరాలే అయినా అతనంటే అభిమానం చూపించే అమ్మాయిల సంఖ్య మాత్రం పెరగటమే తప్ప తగ్గటం లేదు. మహేష్ అందానికి అమ్మాయిలే కాదు టాలీవుడ్ హీరోయిన్లు కూడా ఫిదా అయ్యామని అనేక సందర్భాల్లో చెప్పారు. కొందరు హీరోయిన్లు మహేష్ తో కలిసి ఒక్క సీన్లో నటించినా చాలని ఆశ పడుతుంటే ఇప్పటికే అతనితో కలిసి నటించిన హీరోయిన్లు మహేష్ బాబుతో మరలా నటించాలని అభిప్రాయపడుతున్నారు. 
 
యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో మహేష్ బాబు మాత్రమే అమ్మాయిల కలల రాకుమారుడుగా భీభత్సమైన లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. సంక్రాంతి పండుగ కానుకగా సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల కాబోతుంది. మహేష్ బాబుకు జోడీగా రష్మిక మందన్నా ఈ సినిమాలో నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: