తెలుగు సినీ పరిశ్రమలో హీరోలు తమ తమ స్థాయిలో కష్టపడుతూ పైకి ఎదుగుతున్నారు. ఎన్టీఆర్, చిరంజీవి.. ల్లా లాంగ్ టైమ్ స్టార్ డమ్ ఈరోజుల్లో సాధ్యం కాదు. అందుకే ప్రతి సినిమా జాగ్రత్తగా చేస్తున్నారు. ఎంతటి హిట్ సాధించాం, వసూళ్లు ఎంత పెంచాం, క్రేజ్ ఏ స్థాయికి పెంచుకున్నాం.. అంటూ  ముందుకెళ్తున్నారు. వీరిలో టాలీవుడ్ లో ముందువరుసలో ఉన్నది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సినిమా.. సినిమాకి గ్రాఫ్ పెంచుకుంటున్న ప్రభాస్ కు బాహుబలి రూపంలో భారీ స్పాన్ వచ్చింది. దీంతో ప్రభాస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.

 

 

ఈ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్ లెక్కలనే కాకుండా.. భారతీయ సినిమా లెక్కలనే మార్చేశాడు. ఓ రీజనల్ సినిమా ఈస్థాయిలో కలెక్షన్లు రాబట్టడం.. ఎవరికీ అంతుబట్టని విషయం. అప్పటివరకూ ఉన్న కలెక్షన్ స్థాయిని మరో కొత్త మార్క్ కు తీసుకెళ్లాడు. 90వ దశకంలో తెలుగు సినిమా కలెక్షన్ల స్థాయిని చిరంజీవి పెంచారు. ఇప్పుడు బాహుబలితో ప్రభాస్ కొత్త లెక్కలతో టార్గెట్ ఫిక్స్ చేసాడు. దీంతో టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డ్స్ పేరుతో రికార్డ్స్ ను ఫిక్స్ చేశారు. ఎందుకంటే.. బాహుబలిని రీచ్ కావాలన్నా.. బాహుబలిని దాటాలన్నా.. ఓస్థాయి ఉన్న సినిమా అయినా రావాలి.. లేదా దేశవ్యాప్తంగా ఆకట్టుకునే కథ అయినా ఉండాలి. అలాంటి ప్లేస్ లో బాహుబలిని కూర్చోబెట్టారు.

 

 

బాహుబలితో ఒక్కసారిగా అన్ని సినిమా పరిశ్రమల చూపు టాలీవుడ్ పై ముఖ్యంగా ప్రభాస్ పై పడింది. ప్రభాస్ ఆహార్యం, నటన అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రభాస్ ను ఈస్థాయిలో మాలిచింది దర్శకుడు రాజమౌళి. కాల్షీట్స్ కావాలంటూ ప్రభాస్ కోసం ప్రయత్నించని నిర్మాత ఉండడు. ఖర్చు కోసం ఆలోచించటం లేదు. మొత్తానికి ప్రభాస్ రూపంలో టాలీవుడ్ సినిమా కలెక్షన్ల స్థాయి దశదిశలా తెలిసింది అనటంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: