నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రూలర్. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ముందునుండ్ నెగటివ్ టాక్ ఉంది. సినిమాలో బాలకృష్ణ మోడ్రెన్ లుక్ లో కనబడటమే కాకుండా పవర్ ఫుల్ పోలీస్ గా నటించారని తెలుస్తుంది. డిసెంబర్ 20న అనగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాలయ్య రూలర్ సినిమాకు పెద్దగా బజ్ ఏం లేదని తెలుస్తుంది.

 

నందమూరి ఫ్యాన్స్ కు ఓ పదిరోజులు ముందే న్యూ ఇయర్ గిఫ్ట్ వస్తుందని అనుకోగా సినిమాపై వస్తున్న రూమర్స్ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నాయి. రూలర్ బిజినెస్ కూడా అనుకున్నంత రేంజ్ లో జరగలేదని తెలుస్తుంది. ఇక థియేటర్ల పరిస్థితి అదేవిధంగా ఉందని అంటున్నారు. రీసెంట్ గా రిలీజైన వెంకీమామ కన్నా తక్కువ థియేటర్స్ లో బాలకృష్ణ రూలర్ రిలీజ్ అవుతుందని సమాచారం.

 

అయితే థియేటర్లే దొరకని బాలయ్య రూలర్ కు ఆడియెన్స్ దొరుకుతారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెగటివ్ ఫ్యాన్స్. బాలకృష్ణ రూలర్ కు పోటీగా మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ప్రతిరోజు పండుగే సినిమా వస్తుంది. మారుతి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి.

 

బాలయ్య రూలర్ కన్నా శుక్రవారం రిలీజవుతున్న సాయి ధరం తేజ్ పతిరోజు పండుగే సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. సాయి ధరం తేజ్ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో 800 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. మరి బాలకృష్ణ, సాయి ధర్మ తేజ్ పోటీలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. బాలకృష్ణ రూలర్ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటించారు. సి.కె ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో సి కళ్యాన్ రూలర్ మూవీ నిర్మించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: