ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు రిలీజైతే చాలు నిర్మాతలకు కనకవర్షం కురిపిస్తున్నాయి. హిట్ టాక్ వచ్చిన సినిమాలతో మాత్రమే కాదు ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలతో కూడా మహేష్ బాబు 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధిస్తూ ఉండటం గమనార్హం. మహేష్ బాబు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన దూకుడు సినిమా 101 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించగా 58 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. 
 
మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను 87 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను రాబట్టింది. మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించగా 92 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను రాబట్టింది. మహేష్ బాబు నటించిన మహర్షి 168 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను, 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. 
 
మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పైడర్ మూవీకి డిజాస్టర్ టాక్ వచ్చినా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాగా 62 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రమే థియేటర్ల వైపు చూస్తున్నారు. ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలు కలెక్షన్లను రాబట్టుకోలేక చతికలపడుతున్నాయి. కానీ మహేష్ బాబు మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలతో కూడా 100 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టాడు. మహేష్ బాబు నటించిన చివరి మూడు సినిమాలు 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టడం గమనార్హం. 
 
మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. 100 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుస సక్సెస్ లతో జోష్ మీదున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ బాబు కెరీర్లోనే సరిలేరు నీకెవ్వరు సినిమా హైయెస్ట్ కలెక్షన్లు సాధిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: