టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసులు హీరోలుగా వస్తున్న తరుణంలో సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు ‘రాజకుమారుడు’ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  మొదటి పెద్దగా పేరు తీసుకు రాలేక పోయింది. స్టార్ హీరో హోదా ఉన్నా.. కంటెంట్ సరిగా లేకపోవడంతో కెరీర్ బిగినింగ్ లో మహేష్ కాస్త ఇబ్బంది పడ్డారు. క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వంలో ‘మురారి’ సినిమాలో నటించాడు.  కుటుంబ నేపథ్యంలో ఎమోషన్స్ తో కూడిన ఈ మూవీలో మహేష్ బాబు తన పర్ఫామెన్స్ తో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు. అప్పటి వరకు లవర్ బాయ్ గా ఉన్న మహేష్ బాబు ‘అతడు’, ‘ ఒక్కడు’ , ‘పోకిరి’ లాంటి మూవీస్ తో మాస్ ఇమేజ్ సంపాదించారు.

 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ మూవీ తర్వాత మహేష్ బాబు కి ఒక్కసారే స్టార్ ఇమేజ్ పెరిగిపోయింది.  ఓ వైపు యాడ్స్ మరోవైపు సినిమాలతో బిజీగా మారిపోయారు.  ఏంత గొప్ప హీరో అయినా తన కెరీర్ లో కొన్ని సార్లు పొరపాట్లు చేస్తుంటారు.. మహేష్ బాబు కూడా అలాంటి పొరపాలు ఓ రెండు మూవీస్ విషయంలో చేశారంటారు.  దూకుడు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు ‘ఆగడు’ సినిమాతో భారీ డిజాస్టర్ పొందారు.  దూకుడు సినిమాలో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించి నిజంగానే తన దూకుడుతో దుమ్మురేపారు.  ఇదే స్థాయిలో ఆగడు సినిమాలో సైతం పోలీస్ ఆఫీసర్ గా నటించారు.. కానీ కంటెంట్ పరంగా ఆకర్షించలేకపోవడంతో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  

 

ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ దారుణమైన డిజాస్టర్ పొందింది.  శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ తో ఘోరమైన పరాజయం పొందారు.  ఆ తర్వాత మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్పైడర్’ మూవీ డిజాస్టర్ అయ్యింది.  మొత్తానికి మంచి జోష్ లో ఉన్న మహేష్ బాబు ఆ మద్య ఆగడు, బ్రహ్మోత్సవంతో కెరీర్ పరంగా రాంగ్ స్టెప్పులే అని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: