తన కెరీర్లో ఇప్పటివరకు 350కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారు మొదటి సినిమా సాక్షి నుండి ఒక్కొక్కటిగా తనకు వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని నటుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు టాలీవుడ్ అగ్రనటులుగా కొనసాగుతున్న సమయంలో నటుడిగా రంగప్రవేశం చేసిన కృష్ణ, ఒకానొక సమయంలో వారిద్దరిని మించి పోయి అతి పెద్ద మాస్ హీరోగా మంచి పేరు గడించడం జరిగింది. ఇక కెరీర్ పరంగా ఎన్నో అత్యద్భుత సినిమాల్లో నటించిన కృష్ణ గారు, 

 

చూడడానికి ఎంత అందంగా ఉంటారో, ఆయన మనసు కూడా అంతే అందంగా ఉంటుందని చాలా మంది సినిమా ప్రముఖులు చెప్తుండడం విన్నాం. తనతో సినిమాలు చేసి నష్టపోయిన నిర్మాతలు మరియు దర్శకుల్లో కొంతమందికి, తన తదుపరి సినిమాలు ఉచితంగా చేసిపెట్టిన గొప్ప ఉదారత గుణం కృష్ణ గారిది. ఇక ఆయన నట వారసత్వంతో టాలీవుడ్ కి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన చిన్న కొడుకు మహేష్ బాబు, బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన అనంతరం, కొంత విరామం తీసుకుని పెరిగి పెద్దయ్యాక రాజకుమారుడు అనే సినిమాతో రంగప్రవేశం చేసారు. ఆ తరువాత ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించిన మహేష్ బాబు, తండ్రి కృష్ణ గారి పేరు నిలబెడుతూ తాను కూడా సూపర్ స్టార్ గా ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దూసుకుపోతున్నారు. 

 

ఇక తన పెద్ద కుమార్తె పద్మావతిని గల్లా జయదేవ్ కు, రెండవ కుమార్తె మంజులను సంజయ్ కు, మూడవ కుమార్తె ప్రియదర్శినిని నటుడు సుధీర్ బాబుకు ఇచ్చిన వివాహం చేసిన కృష్ణ గారు, పెద్ద కొడుకు రమేష్ బాబును కెరీర్ పరంగా సక్సెస్ కాకపోవడం మాత్రం కొంత ఇబ్బందిని కలిగించింది. అయినప్పటికి చిన్నకుమారుడు మహేష్ బాబు ఆ లోటును భర్తీ చేస్తూ ముందుకు సాగుతుండడం కృష్ణ గారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్న విషయం. ఆయన రెండవ కుమార్తె మంజుల ప్రస్తుతం నిర్మాతగా, అలానే నటిగా కూడా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఇక మహేష్ కూడా తండ్రి వలే ప్రస్తుతం తనవంతుగా పలు సేవ కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు దక్కించుకుంటున్నారు. ఈ విధంగా సూపర్ స్టార్ ఫ్యామిలీ టాలీవుడ్ స్టార్ల కుటుంబాల్లో ఎంతో ఆదర్శం అని చెప్పాలి.....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: