నందమూరి ఫ్యామిలీ నుండి ఒక చిన్నపిల్లవాడు నందమూరి హరికృష్ణ కొడుకుగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆసమయంలో ఎందరో నందమూరి నటవారసుల లిస్ట్ చాల పెద్దది. ఈ చిన్న పిల్లవాడు ఏం నిలదొక్కుకుంటాడులే సినీరంగంలో అని అనుకునే ఉంటారు. కాని ఆ పిల్లవాడికి వచ్చిన లక్షణాలు అచ్చం నందమూరి ఎన్‌టియార్  లాగే ఉన్నాయి. అన్న ఎన్‌టీయార్ గారే మళ్ళీ పుడితే ఇలాగే ఉంటారా అనేలా అచ్చుగుద్దినట్లుగా జూనియర్ ఎన్‌టీయార్ ఉండటం. అతన్నికి కలిసి వచ్చిన అంశం. ఇకపోతే జూనియర్ ఎన్‌టీయార్ చేసిన సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచిపోతే మరికొన్ని ఫ్లాప్‌లుగా మిగిలాయి.

 

 

ఒకగానొక దశలో హిట్ కొట్టడానికి ఈ నందమూరి చిన్నోడు చాలా శ్రమించవలసి వచ్చింది. అలాంటి ప్రాబ్లాన్ని ఎక్కువగా 2011లో జూనియర్ ఎన్‌టీయార్ ఎదుర్కొన్నారు. అభిమానులా ఆశలను నిరాశపరచారు. నటనలోను, డ్యాన్స్‌లోను, డైలాగ్ చెప్పడంలోనూ ఇరగ దీసే జూనియర్ తారక్ ఏమైంది అని అభిమానులంతా ఆందోళన చెందిన సందర్భాలు ఉన్నాయి.. ఇకపోతే 2011నుంచి ర‌భ‌స‌, రామ‌య్యా వ‌స్తావ‌య్యా, శ‌క్తి, ద‌మ్ము వ‌రుస ప్లాపులు తారక్‌ను తికమక పెట్టడమే కాకుండా ఆలోచనలో పడేసాయి..

 

 

అప్పుడు పడింది.టెంప‌ర్ అనే సినిమా. ఆకలితో ఉన్న సింహానికి ఆహారం దొరికితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో దయలేని దయాగాడిగా ప్రేక్షకులకు తనలోని నట కౌశల్యాన్ని రుచి చూపించాడు. ఇక అప్పటివరకు ఎర్రలైటులా ఉన్న ఎన్‌టీయార్ సినీ లైఫ్ మళ్లీ గాడిలో పడింది. ఆ సినిమా బంపర్ హిట్ సొంతం చేసుకుంది.. ఇక అప్పటి నుంచి అన్ని హిట్లే ! ఇలా వెండితెర మీద మాత్ర‌మే కాకుండా బిగ్‌బాస్‌ షోతో బుల్లితెర మీద కూడా సూప‌ర్‌హిట్ అయ్యాడు యంగ్‌టైగ‌ర్ ఎన్టీయార్‌. ఇకపోతే దశాబ్ద కాలంలో ప్లాపుల‌తో పాతాళంలోకి వెళ్లిన నందమూరి చిన్నోడు ఇప్పుడు సూప‌ర్ హిట్ల‌తో ఆకాశంలోకి తారజువ్వలా దూసుకెళ్లుతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: