టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలే ప్రధాన కుటుంబాలలో ఒక కుటుంబం నందమూరి కుటుంబం. నందమూరి వంశం నుండి చాలా మంది హీరోలు ఇప్పటికే వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన కొద్ది మంది మాత్రమే సక్సెస్ అందుకున్నారు. అయితే ఎక్కువగా నందమూరి ఫ్యామిలీకి ఇండస్ట్రీలో మంచి వెయిట్ ఉండేటట్లు సినిమాలు చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుత తరానికి నచ్చే విధంగా తన లుక్ తో పాటు తన బాడీ ని చేంజ్ చేసుకుని ప్రస్తుత ఆడియన్స్ టేస్ట్ కి తగ్గ విధంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒప్పుకొని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలు నమోదు చేసుకున్నాడు మరియు అదే విధంగా నందమూరి అభిమానులను అలరిస్తున్నాడు.

 

అటువంటి జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి కుటుంబంలో ఉన్న కొంతమంది ప్రముఖులు తమ కుటుంబ సభ్యుడు కానట్టుగా తారక్ ని పక్కన పెట్టేందుకు కుట్రలు కుయుక్తులు నందమూరి ఫ్యామిలీ లో ఉండే పెద్ద పెద్ద తలకాయలు ప్రయత్నాలు చేస్తున్నారని ఎప్పటినుండో సినిమా ఇండస్ట్రీలో మరియు రాజకీయ రంగంలోనూ వార్తలు వినబడుతున్నాయి. అయితే ఏది ఏమైనా నందమూరి ఫ్యామిలీ అనే పేరు వస్తే ముందుగా ప్రస్తుతం ఉన్న ప్రేక్షకులకు నందమూరి అభిమానులకు ఆ ప్రముఖుల కంటే అదే వంశం నుండి వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ పేరు మాత్రమే ప్రస్తుతం గుర్తొస్తుందని ఎప్పటికైనా నందమూరి వంశం పేరు నిలబెట్టేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అని ఆయన్ని పక్కన పెట్టాలని ఎవరైనా చూస్తే వారిని మేమే పక్కన పెడతాము అంటున్న నందమూరి అభిమానులు తారక్ పై జరుగుతున్న కుట్రలు కుయుక్తులు గురించి మండిపడుతున్నారు.

 

జూనియర్ ఎన్టీఆర్ పై ఎటువంటి కుట్ర ఎవరు జరిపిన అది నందమూరి ఫ్యామిలీ అయినా నారా ఫ్యామిలీ అయినా ఊరుకునే ప్రసక్తి లేదని నందమూరి డై హార్ట్ ఫ్యాన్స్‌ కామెంట్ చేస్తున్నారు. మరి అదేవిధంగా పబ్లిక్ కూడా నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ పట్ల వివక్ష జరుగుతుంది అనే వార్త పట్ల వాస్తవం ఉందని కుటుంబంలో అలాంటి గొడవలు జరగడం వల్ల అది నందమూరి ఫ్యామిలీకి డామేజ్ అవుతుంది అని కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: